పోతేపల్లి గ్రామంలో కుక్కల కలకలం..!
కుక్కల దాడికి బలైన 30 గొర్రెలు మృత్యువాత
విలవిలలాడిపోతున్న ఎట్టయ్య
గొర్రెలను దొడ్డిలో ఉంచి ఇంటికి రాగా కుక్కలు వాటిపై దాడి
సాక్షిత : రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం పోలేపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కోడిగని ఎట్టయ్య దొడ్డిలో ఉన్నటువంటి గొర్రె పిల్లలని వీధి కుక్కలు వీరంగం సృష్టించినవి రైతుకు సంబంధించిన 30 గొర్రె పిల్లలు వీధి కుక్కలు కొరికి చంపేయడం జరిగింది.రేకాడితే కానీ డొక్కాడని పరిస్థితి గొర్రెలు మేపుతూ జీవనాధారం చెందేవాడు. వీధి కుక్కల వల్ల బలైన 30 గొర్రె పిల్లల్ని చూసి చలించిన ఏట్టయ్య. మేకల గుంపులో వీధి కుక్కలు పరిగెత్తించి పీక్కు తిన్నాయి.
దొడ్డిలో ఉన్న చనిపోయిన గొర్రెలను చూసి కంటతడి పెట్టి లబోదిబోమన్న ఏట్టయ్య. ఇలాంటి సంఘటనలు మరి ఎవరికి జరగకుండా అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరారు. మరి ఎన్ని ప్రాణాలు పోయాక అధికారులు స్పందిస్తారో..? గతంలో హైదరాబాదులో పిల్లోడిని బలిగొన్న వీధి కుక్కలు అలాంటి సంఘటనలు మరి జరగకుండా అధికారులు పోలేపల్లి గ్రామానికి స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు రైతులు ఆవేదన చెందారు. వీధి కుక్కల దాటికి బలైన 30 గొర్రె పిల్లలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని. వారు కోరారు.