సీఎంఓకు వెళ్లిన ఫైల్స్ ఎక్కడున్నాయి?వెనక్కి వచ్చాయా?
సెక్రటేరియట్‌లో బీఆర్ఎస్ లీడర్ల కదలికలపై సీఎస్ శాంతికుమారి స్పెషల్ ఫోకస్..
:తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌లో బీఆర్ఎస్ లీడర్ల కదలికలపై సీఎస్ శాంతికుమారి స్పెషల్ ఫోకస్ పెట్టారు.పేషీల నుంచి ఒక్క కాగితం కూడా బయటికి వెళ్లొద్దని ఆదేశించారు. దీంతో ప్రతి బ్యాగును సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అనుమానం వస్తే వెంటనే ఉన్నతా ధికారులకు ఇన్పర్మేషన్ ఇస్తున్నారు..కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు చకచక ఏర్పాట్లు జరుగు తుండటంతో కేసీఆర్ సర్కారులో పనిచేసిన మంత్రుల పేషీలు ఖాళీ అవుతున్నాయి. పనిలో పనిగా ఫైల్స్ తీసుకెళ్తారనే డౌట్‌తో అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు డిస్కషన్ జరుగుతున్నది.
పేషీలపై నిఘా?
ఓ వైపు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరుగు తుండటంతో మరోవైపు మంత్రుల పేషీలు ఖాళీ అవుతున్నాయి. మాజీ మంత్రుల అనుచరులు, పీఏలు వచ్చి పేషీల్లోని సామగ్రిని తీసుకెళ్తున్నారు.అయితే ఒక్క పేపర్ కూడా బయటికి తీసుకెళ్లొద్దని సీఎస్ ఆదేశాలు జారీ చేశారని సమాచారం.దీంతో ప్రతి బ్యాగును సెక్యూరిటీ స్టాఫ్ తనిఖీ చేసి,బయటికి పంపుతున్నారు…ప్రధానంగా పేపర్లు కనపడితే, వాటిని వెనక్కి పంపుతున్నారు. నాకు తెలియకుండా ఒక్క పేపర్ కూడా బయటికి వెళ్లొద్దు. చివరికి మాజీ మంత్రుల పర్సనల్ పేపర్లు ఉన్నా పంపొద్దు.’ అని సీఎస్ ఆదేశించినట్టు ఓ సెక్యూరిటీ ఆఫీసర్ వెల్లడించారు.అలాగే పెన్‌డ్రైవ్‌లు, కంప్యూటర్లు, ఇతర డిజిటల్ వస్తువులను స్వాధీనం చేసుకోవాలని జీఏడీ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తున్నది.దీంతో ఖాళీ చేస్తున్న ప్రతి పేషీల్లోకి జీఏడీ ఆఫీసర్లు వచ్చి, ఏఏ వస్తువులు తీసుకెళ్తున్నారు? అనే లెక్కలు రాసుకుంటున్నారు.
కీలక ఫైళ్ళు స్వాధీనం చేసుకున్నారా?లేదా?
అయితే మినిస్టర్స్ పేషీలను వెకేట్ చేస్తున్న సమయంలో ఫైల్స్ బయటికి వెళ్లకుండా తగు జాగ్రత్తలను అధికారులు తీసుకున్నట్టు సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి…అందులో భాగంగానే ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తున్నది. అయితే ఇప్పటికే కొన్ని కీలక ఫైల్స్ మాయం అయ్యాయనే ఫిర్యాదుతోనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది..లేకపోతే ఫైల్స్ తీసుకెళ్తున్నారనే అనుమానంతో నిఘా పెట్టారా? అనే చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతున్నది.కాగా,ఇంతకాలం వివిధ మంత్రుల పేషీలు, సీఎంఓ సెక్రటరీల వద్ద ఉన్న ఫైల్స్ ఒక్కక్కటి ఆయా శాఖలకు చేరుతున్నాయి.మంత్రులు పేషీలు,సీఎంఓ సెక్రటరీల స్టాఫ్ ఫైల్స్‌ను డిపార్ట్‌మెంట్స్‌కు అందచేస్తున్నారు.మంత్రి పేషీలకు వెళ్లిన ఫైల్స్ అన్ని వెనక్కి వచ్చాయా? అవి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి? అలాగే సీఎంఓకు వెళ్లిన ఫైల్స్ ఎక్కడున్నాయి?
అవి వెనక్కి వచ్చాయా? అనే ఇన్పర్మేషన్‌ను తీసుకో వాలని అన్ని శాఖల సెక్రటరీలను సీఎస్ ఆదేశించినట్టు సమాచారం..అయితే కాన్పిడెన్షియల్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? ఎవరి వద్ద ఉన్నాయని ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది…
,,,,,,,,,,,,,,,,,