do-not-drive-under-the-influence-of-alcohol
-హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి*
ట్రాఫిక్ చట్టాలను అతిక్రమించకూడదు
-Helmet must be worn*
Do not violate traffic laws
ఎస్సై జన్ను ఆరోగ్యం
సాక్షిత : సైదాపూర్ మండలం కరీంనగర్ జిల్లా
సైదాపూర్ మండల పరిధిలో
మద్యం తాగి వాహనాలు నడిపి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ఇబ్బందులకు గురి చేయకూడదని సైదాపూర్ ఎస్సై జన్ను ఆరోగ్యం కోరారు. మంగళవారం సైదాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. అజాగ్రత్తతో, అతివేగంగా వాహనాలు నడిపి ప్రాణాలను కోల్పోయి తమపై ఆధారపడ్డ కుటుంబాలను అనాధలుగా మార్చకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. సెల్ఫోన్లో మాట్లాడుతూ మద్యం తాగి డ్రైవింగ్ చేయకూడదని విజ్ఞప్తి చేశారు
. తప్పనిసరిగా వాహనాలు రిజిస్ట్రేషన్ తో పాటు ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ పత్రాలను వాహనంలో అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే జరగక ముందే జాగ్రత్తగా వాహనాలను నడిపి వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని సూచించారు. 2022 వాహన చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని,ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చట్టాలకు లోబడి వాహనాలు నడపాలని విజ్ఞప్తి చేశారు. చట్టాలను అతిక్రమించి వాహనాలు నడిపితే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
నిబంధనల ప్రకారం వాహనాలు నడిపినప్పటికీ ప్రమాదవశాత్తు ప్రమాదాలు జరిగినపుడు వారు చట్టపరంగా నష్ట పరిహారం పొందవచ్చని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ రూల్స్ విరుద్దంగా మితిమీరిన వేగంతో వాహనాలను నడపకూడదని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని పేర్కొన్నారు.