గద్వాల:-ఎవరైనా గొప్ప పనులు చేస్తుంటే వాటిని అంగీకరించకుండా తమ గురించి మాత్రమే గొప్పలు చెప్పుకునే చిల్లర గుణం కేసీఆర్ కుటుంబానికి ఉందని డీకే అరుణ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి క్రెడిట్ అంతా తమకే దక్కాలని చూస్తున్నారని, తెలంగాణకు ఏం చేసినా అది తమ వల్లే అని చెప్పుకునే పనిలో ఆ ఫ్యామిలీ ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును గమనించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పెద్ద ఎత్తున సహకారం అందిస్తోందన్నారు. మోడీ వరంగల్ టూర్ సందర్భంగా ఓ ఛానెల్ తో మాట్లాడిన డీకే అరుణ.. కేంద్ర సహకారం కోరకండా రాష్ట్ర ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు.
లక్షలాది కోట్లు అప్పులు తీసుకువచ్చి వేలాది కోట్లు దోచుకుంటున్న వీరికి కేంద్రం చేస్తున్న అభివృద్ధి ముష్టిలా కనబడుతుందన్నారు. కేసీఆర్ చెప్పాలనుకున్నది కేటీఆర్ ద్వారా చెప్పించారని ఈ రాష్ట్రానికి కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పేరుకే కేసీఆర్ సీఎం అని నిజానికి అంతా నడిపిస్తున్నది కేటీఆరే అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోతుందని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ఆమె తిప్పికొట్టారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోరాటం చేస్తుందని గతంలో అనేక సార్లు చెప్పామన్నారు.
పేరుకే కేసీఆర్ సీఎం.. నడిపించేది మొత్తం ఆయనే: డీకే అరుణ
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…