SAKSHITHA NEWS

విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలి జిల్లా ఎస్పీ

రక్షిత కే మూర్తి, IPS

వార్షిక తనిఖీల్లో భాగంగా ఖిల్లా ఘనపూర్ పోలీస్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

వనపర్తి:వార్షిక తనిఖీల్లో భాగంగా వనపర్తి జిల్లా పరిధిలోని ఖిల్లా ఘనపూర్ మండల పోలీస్టేషన్ ” వార్షిక తనిఖీలలో ” భాగంగా వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి రక్షిత కే మూర్తి, IPS క్షుణ్ణంగా తనిఖీచేశారు.
పెండింగ్ లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను ఘనపూర్ ఎస్సై K. శ్రీహరి ని అడిగి తెలుసుకున్నారు.

పోలీస్టేషన్ లో రోజువారిగా నమోదవుతున్న ఫిర్యాదులు, కేసుల రికార్డులను పరిశీలించారు.
పోలీస్టేషన్ రిసెప్షన్, లాకప్ ,మెన్ బ్యారేక్, టెక్నికల్ రూం, పరిసరాలను పరిశీలించారు.
రిసెప్షన్ కౌంటర్ ను సందర్శించి ఫిర్యాదు స్వీకరించిన అనంతరం నమోదు చేసిన రిసెప్షన్ డైరీని పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మేడం మాట్లాడుతూ విధుల పట్ల అంకితభావం గా ఉండాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. న్యాయబద్ధంగా చట్టాన్ని అమలు చేయడం పోలీసుల బాధ్యత అని ముందుగా చట్టాలను స్వయంగా పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు.
ఘనపూర్ మండలంలో
అనుమానిత వ్యక్తులు ఎప్పుడు కనిపించినా వెంటనే తనిఖీ చేయాలని సూచించారు.
అక్రమ మార్గంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడకుండా పటిష్టంగా పెట్రోలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి ప్రమాదాల నివారించడానికి కృషి చేయాలని తెలిపారు. ఆర్థిక నేరాలకు కట్టడి చేయడానికి సీసీ టీవీ కెమెరాలు అమర్చే విధంగా ప్రజలకు చైతన్య పరచాలి అని పేర్కొన్నారు.
ప్రజలు ఎటువంటి సమాచారమైనా డయల్ – 100 ద్వారా తెలుపవచ్చు అని సూచించారు.

ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.
రాత్రి పెట్రోలింగ్ అధికారులు లాడ్జిలు మరియు పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు
సైబర్ నేరాల నియంత్రణ గురించి గ్రామాలలో పట్టణాలలో మరియు ప్రజలకు ప్రజాప్రతినిధులకు యువకులకు గ్రామాల విపిఓలు, పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఈ సమావేశంలో వనపర్తి DSP అనదరెడ్డి , కొత్తకోట సీఐ, శ్రీనివాసరెడ్డి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్న


SAKSHITHA NEWS