SAKSHITHA NEWS

నేటి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో పల్స్ పోలియో కు సంబంధించి పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు ఖచ్చితంగా వేయించాలని అన్నారు. నేడు (మార్చి 3, ఆదివారం) జిల్లా వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 4, 5 తేదీల్లో కూడా మాపప్‌ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 1,30,747 మంది ఐదేళ్లలోపు పిల్లలను గుర్తించినట్లు, వారందరికీ చుక్కలు వేసేందుకు ఏర్పాటు చేశామన్నారు. 950 పోలియో బూత్‌లు, రైల్వే, బస్ స్టేషన్ల వద్ద 30 బూత్‌లు ఏర్పాటు చేశామని అన్నారు. 30 మొబైల్‌ బృందాలు, 3800 మంది సిబ్బంది, 95 మంది సూపర్‌వైజర్లలతో పల్స్ పోలియోకు ఏర్పాట్లు చేసినట్లు ఆయన అన్నారు. వంద శాతం 0-5 పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు అందేలా పక్కా కార్యాచరణ చేసినట్లు కలెక్టర్ అన్నారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా. సుబ్బారావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి డా. ప్రమీల, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎం.ఏ. గౌస్, డెమోలు కాశీనాథ్, సాంబశివరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
WhatsApp Image 2024 03 02 at 6.42.55 PM

SAKSHITHA NEWS