బ్యాంకులు సకాలంలో ఋణాలు అందించి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలి.జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

బ్యాంకులు సకాలంలో ఋణాలు అందించి ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాంకర్లను ఉద్దేశించి మాట్లాడుతూ, అర్హులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు త్వరితగతిన చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. 2022-23 వార్షిక ఋణ ప్రణాళికలో మార్చి 2023 వరకు 3403 కోట్లు స్వల్పకాలిక పంట ఋణాలుగా అందచేయడం జరిగిందని, దీనిలోనే వ్యవసాయ టర్మ్ ఋణాలుగా వ్యవసాయ రంగానికి 1646 కోట్లు బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 6579 మంది రైతులకు 13400 ఎకరాలకు సంబంధించి ఆర్వోఎఫార్ పట్టాలు జారిచేసినట్లు, ఇట్టి పట్టాలు భూ రికార్డులు ధరణిలో నమోదు ఉండదని ఆయన అన్నారు.

ఇట్టి రైతులు పంట రుణాల కొరకు బ్యాంకులను సంప్రదించినప్పుడు బ్యాంకర్లు ధరణి నమోదు గురించి అడుగుతున్నారని, ఇట్టి రైతుల జాబితా బ్యాంకర్లకు పంపుతున్నట్లు, ఇట్టి జాబితా ప్రకారం ఆయా రైతులకు పంట రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యవసాయ ఋణాలను సకాలంలో అందించి లక్ష్యాలను సాధించాలని, రైతులు పంట ఋణాలు సకాలంలో చెల్లించేలా అధికారులు క్షేత్ర స్థాయిలో శ్రద్ధ కనబరచాలని కలెక్టర్ తెలిపారు. సూక్ష్మ ఋణాల క్రింద సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలకు గాను 90 కోట్లు ఇవ్వడం జరిగిoదని, విద్యా ఋణాలుగా 30 కోట్లు, గృహ ఋణాలుగా 77 కోట్లు అందించడం జరిగిందని ఆయన అన్నారు. ప్రాధాన్యతా రంగాలకు మొత్తంగా 6970 కోట్లు అందించడం జరిగిందని తెలిపారు. అప్రధాన్యత రంగాలకు 3417 కోట్లు అందించినట్లు, మొత్తంగా జిల్లాలో 10387 కోట్లు బ్యాంకుల ద్వారా అందించినట్లు కలెక్టర్ తెలిపారు.

ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఏర్పరచుకున్న పేదలకు అట్టి స్థలాల క్రమబద్ధీకరణ కు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, అట్టి వారికి గృహ నిర్మాణ రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు సకాలంలో ఋణాలు అందచేసి లబ్దిదారులకు ప్రయోజనం కల్పించాలని సూచించారు. జిల్లాలో 16642 మహిళా సంఘాలకు 2023-24 సంవత్సరానికి రూ. 93168.82 కోట్ల ఋణాలు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, దీనిలో జూన్ నెలాఖరుకు 748 సంఘాలకు గాను 5599.73 కోట్లు అందించి 40.35 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందని ఆయన అన్నారు.

అర్హత ఉన్న సంఘాలకు ఋణాలు వెంటనే అందించాలని, రెన్యువల్ లో ప్రాసెసింగ్ ఫీజు లేకుండా చూడాలని తెలిపారు. మెప్మా క్రింద 766 సంఘాలకు గాను ఇప్పటి వరకు 135 సంఘాలకు రూ. 1653.55 లక్షలు ఋణాలుగా అందించడం జరిగిందని, అలాగే వీధి వ్యాపారులకు అందించే ఋణానికి సంబంధించి జిల్లాలో 17225 వీధి వ్యాపారులకు మొదటి టర్మ్ రుణాల క్రింద 17111 లక్షలు, 6563 మంది వ్యాపారులకు రెండవ టర్మ్ క్రింద 6430 లక్షలు, మూడవ టర్మ్ క్రింద 361 మంది వ్యాపారులకు 337 లక్షలు అందించినట్లు ఆయన తెలిపారు. పి.ఎం.ఇ.జి.పి., పి.ఎం.ఎఫ్.ఎం.ఇ. ఋణాలు లబ్దిదారులకు సకాలంలో అందించాలని ఆయన సూచించారు. పాడి, మత్స్య పరిశ్రమలకు సంబంధించి లబ్దిదారులకు కిసాన్ క్రెడిట్ ఋణాలు సకాలంలో ఇవ్వాలని తెలిపారు.

రిజర్వు బ్యాంకు సూచనల మేరకు నూరు శాతం ప్రజలకు డిజిటల్ సేవలు అందించేలా కృషి చేయాలని, దీనికి బ్యాంకులు ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు.
రాబోయే 2023-24 సంవత్సరానికి నిర్దేశించిన వార్షిక ఋణ ప్రణాళికను జిల్లా కలెక్టరు విడుదల చేశారు. జిల్లాలో 6432.40 కోట్ల ఋణ లక్ష్యంగా నిర్ణయించినట్లు, దీనిలో వ్యవసాయరంగానికి 4966.66 కోట్లు, సూక్ష్య ఋణ ప్రణాళికకు 520.64 కోట్లు, విద్యారంగానికి 236.60 కోట్లు, గృహ నిర్మాణానికి 464.40 కోట్లు, ఇతర మౌళిక వసతులకు 31.45 కోట్లు, సోలార్ ఎనర్జీ సంబంధించి 18.38 కోట్లు బ్యాంకుల ద్వారా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో ఎల్డిఎం శ్రీనివాస రెడ్డి, ఆర్బీఐ ఎల్డిఓ వైభవ్ వ్యాస్, నాబార్డ్ డిపిఎం సుజిత్, ఎస్బిఐ ఆర్ఎం విజయ్ కుమార్, ఎపిజివిబి ఆర్ఎం విజయ్ భాస్కర్ గౌడ్, యూబీఐ సీనియర్ మేనేజర్ అచ్యుత్ శ్రీరావ్, డిసిసిబి సిఇఓ వీరబాబు, డీఆర్డీఓ విద్యాచందన, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కృష్ణా నాయక్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వేణు మనోహర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి విజయనిర్మల, ఇడి ఎస్సి కార్పొరేషన్ నవీన్ బాబు, అధికారులు, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page