మున్సిపాలిటీలో మెప్మా మహిళలకు రెండు ఎగ్ కార్టుల పంపిణీ.
చైర్‌పర్సన్ మోర్ల సుప్రజా
బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ నూతన మున్సిపల్ కార్యాలయంలో జాతీయ గుడ్డు పరిరక్షణ సమితి వారి సహకారంతో మెప్మా మహిళలకు రెండు ఎగ్ కార్టులను అందజేసినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ మోర్ల సుప్రజా మురళి తెలిపారు.గుడ్డు వినియోగం మరియు ప్రాధాన్యతను ప్రజల్లో మరింత పెంపొందించాలనే ఉద్దేశంతో జాతీయ గుడ్డు పరిరక్షణ సమితి వారు బుచ్చిరెడ్డిపాళెంమున్సిపాలిటీకి రెండు ఎగ్ కార్టులను అందించారని తెలిపారు.
ఈ ఎగ్ కార్టుల ద్వారా మెప్మా మహిళలు గుడ్డుతో తయారు చేసే వివిధ రకాల ఆహార పదార్థాలను తయారుచేసి ప్రజలకు అందించవచ్చని పేర్కొన్నారు.తద్వారా ప్రజలకు గుడ్డు వల్ల కలిగే పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించడంతో పాటు, మెప్మా మహిళలకు స్వయం ఉపాధి మరియు ఆదాయ మార్గం ఏర్పడుతుందని చైర్‌పర్సన్ తెలిపారు.ఎగ్కార్టులద్వారానాణ్యమైన, రుచికరమైన గుడ్డు ఆధారిత ఆహార పదార్థాలను ప్రజలకు అందిస్తూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనిఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఇ నమల చినబాబు, మెప్మా ఐబి అంకయ్య, మెప్మా సి ఓ నర్మదా, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
