స్వర్గీయ కాంగ్రెస్ నాయకులు గాలి రమేష్ నాయుడు ఆశయాలు సాధిస్తాం

Sakshitha news

స్వర్గీయ కాంగ్రెస్ నాయకులు గాలి రమేష్ నాయుడు ఆశయాలు సాధిస్తాం .


సూర్యాపేట జిల్లా /కోదాడ: సాక్షిత : గాలి రమేష్ నాయుడు వర్ధంతి రోజు సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయo
గాలి రమేష్ నాయుడు 37వ వర్ధంతి సందర్భంగా బిసి విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో గురువారం కోదాడలోని బాయ్స్ హైస్కూల్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ఎంఈఓ సలీం షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరై పెన్నులు ప్యాడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ గాలి రమేష్ నాయుడు వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు ఫ్యాడ్లు పెన్నులు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు.

బీసీ విద్యార్థి జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి నలుగురికి సహాయం చేసే గుణాన్ని గాలి రమేష్ నాయుడు అలవర్చుకున్నారని అన్నారు , ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి సంఘంలో పనిచేసీ ఎంతోమంది విద్యార్థులకు సహాయం చేశారని విద్యార్థి ఉద్యమాలలో చురుగ్గా పాల్గొనేవారని ఆయన ఆశయ సాధన కోసం సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గాలి రమేష్ నాయుడు, మిత్రమండలి అధ్యక్షుడు ఎస్కే షఫీ , ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు బర్మావత్ సీతారాం సింగ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది గాలి శ్రీనివాస్ నాయుడు న్యాయవాది చింతలపాటి చంద్రశేఖర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top