టీ, స్నాక్స్ తయారీలో ప్రమాణాలు పాటించని ఎన్టిపిసి ఐసిహెచ్ క్యాంటీన్….
సాక్షిత పెద్దపల్లి//రామగుండం: ఎన్టిపిసి ప్లాంట్ లో పనిచేసే కార్మికులందరికీ ఐసిహెచ్ క్యాంటీన్ తరపున టీ, స్నాక్స్ తయారీలో ప్రమాణాలు పాటించి నాణ్యమైన టీ, స్నాక్స్ అందించాలని కోరుతూ సిఐటియు అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్
ఆధ్వర్యంలో… ఎన్టిపిసి ప్లాంట్ లో ఐసిహెచ్ మేనేజర్ కు మెమొరాండం అందించారు.
ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎండి యాకూబ్, గిట్ల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..టీ నాణ్యత ,టీ తయారీలో ప్రమాణాలు పాటించడంలేదని, రుచి, నాణ్యత పూర్తిగా తగ్గిపోయాయని అలాగే స్నాక్స్ నాణ్యత లోపించిందని, కొన్నిసార్లు అవి సరిగ్గా ఉడకడం లేదని ఫిర్యాదు చేశారు.
అలాగే టీ అందించే గ్లాసులు చాలా అపరిశుభ్రంగా ఉన్నాయని, ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమని, వెంటనే అపరిశుభ్రమైన గ్లాసులను తీసివేసి, వాటి స్థానంలో కొత్త గ్లాసులను వాడాలని, ఐసిహెచ్ క్యాంటీన్ మేనేజర్ తో క్యాంటీన్ సేవల పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వారికి మెమొరాండం అందించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు దండ రాఘవరెడ్డి, కోశాధికారి ఏ రమేష్, నాయకులు కే మల్లేష్, కే రాజకుమార్, టి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY