కోవూరులో నూతన అధ్యాయానికి శ్రీకారం- ఎం ఎస్ ఎం ఈ పార్కుకు శంకుస్థాపన

Sakshitha news

కోవూరులో నూతన అధ్యాయానికి శ్రీకారం- ఎం ఎస్ ఎం ఈ పార్కుకు శంకుస్థాపన

పారిశ్రామిక అభివృద్ధికి లో కోవూరు .

యువతకు ఉద్యోగ అవకాశమే తమ ప్రభుత్వ లక్ష్యం

ముఖ్య అతిథులుగా పాల్గొన్న కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు ఐదేళ్ల పాలనలో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించాలన్నదే ప్రధాన లక్ష్యంగా తన పాలన సాగిస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.. సి.యం. చంద్రబాబు నాయిడు రాష్ట్ర వ్యాప్తంగా 39 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ విధానంలో సోమవారం శంకుస్థాపన చేశారు .అందులో భాగంగా కొవూరు నియోజకవర్గం పడుగుపాడు లో నూతన ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తో పాటు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు…ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కోవూరు నియోజకవర్గంలో ఎం ఎస్ ఎం ఈ పార్క్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించడం సుదినంగా భావిస్తున్నానన్నారు.

యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంలో, ప్రతి కుటుంబంలో ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలని, ముఖ్యమంత్రి ఆలోచనతో రూపుదిద్దుకున్నదే ఎం ఎస్ ఎం ఈ పార్క్ అన్నారు..మన కోవూరులోని పడుగుపాడులో ఎంఎస్ఎంఈ పార్క్ కోసం సుమారు 14. 5 ఎకరాలు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కు కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను..ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోవూరులో ఎన్నికల సమయంలో పర్యటించిన నేపథ్యంలో తమ నియోజకవర్గంలో సుమారు 2700 ఎకరాల లో కిసాన్ సెజ్ ఉందని , యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపానన్నారు.. కోవూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 55 వేల మెజార్టీతో తాను గెలుపొందేందుకు కారణం యువతే అన్నారు..వారు ఎన్నికల సమయంలో యువత అంతా కలసి తన వెంట నడవడమే అన్నారు..జిల్లాకు కలెక్టర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో కలసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కిసాన్ సెజ్ పరిశ్రమల స్థాపలనకు కదలికలు తీసుకొచ్చారన్నారు… కోవూరు నియోజకవర్గం ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారైంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అన్నారు.కోవూరు నియోజకవర్గంలో జరిగిన యువగళంపాదయాత్రలో యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ బాబు యువతకు 20 లక్షల ఉద్యోగ కల్పన తమ లక్ష్యం అని తెలిపారన్నారు.. ఇచ్చిన మాట ప్రకారంమన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు నుండి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంతో పాటు యువత భవిష్యత్తు, మహిళా సాధికారత కోసం నిరంతర కృషి చేస్తున్నారన్నారు.

రాబోవు రోజుల్లో పారిశ్రామిక రంగంగా కూడా నెల్లూరు జిల్లా ఎంతో ముందుకు వెళ్తుందని అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం గా నేను భావిస్తున్నానన్నారు..కోవూరు షుగర్ ఫ్యాక్టరీ సమస్యతో చాలా మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని,.. పరిష్కరించి కోవూరు ప్రజలకు కానుకగా ఇవ్వాలని ఈ సందర్భంగా కలెక్టర్ ని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ,పెన్నాడెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, జెట్టి మదన్ మోహన్ రావు రెడ్డి, తాటిపర్తి విజయ్ కుమార్ రెడ్డి, దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, ఎంపీపీ తుమ్మల పార్వతి, దారపనేని శ్రీనివాస్ నాయుడు, బత్తల రమేష్, కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, బీదా భాస్కరరావు,పాలూరు వెంకటేశ్వర్లు,పాలూరు బాలకృష్ణ, కొండ తిరుపతిరెడ్డి ,గాదిరాజు అశోక్, సుబ్బయ్య నాయుడు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి చప్పిడి శ్రీనివాసులు రెడ్డి,కోవూరు బిజెపి మండల అధ్యక్షులు పోలిశెట్టి సుబ్బారావు, విజయ డైరీ ఛైర్మెన్ రావిళ్ల వెంకటేశ్వర ప్రసాద్,ఏ.పీ.ఐ.ఐ. సి డైరెక్టర్ లు ఆర్ విరేంద్రనాయిడు,మాదవి,జోన్నవాడ దేవస్థానం పాలక మండలి చైర్మెన్ తిరుమూరు అశోక్ రెడ్డి , కూటమి నాయకులు,కార్యకర్తలు, నెల్లూరు ఆర్డిఓ నాగఅనూష,పరిశ్రమల శాఖ అధికారులు, పాల్గొన్నారు…

Scroll to Top