SAKSHITHA NEWS

సాక్షిత : కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ఆదేశాల సూచనలతో కిరణ్, రాజేష్ ఆధ్వర్యంలో పాటూరు జడ్పీ హైస్కూల్ నందు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందివ్వడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు పెద్దపీట వేశారని, మన స్కూల్ తరఫున టెన్త్ క్లాసులో ఎంత మెరిట్ తెచ్చుకుంటే రాష్ట్రంలో మన స్కూల్ పేరు వినిపిస్తుందని, ప్రతి ఒక్క విద్యార్థి భయంతో కాకుండా ఇష్టంతో చదవాలని, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మంచి పేరు తేవాలని మీరు తెచ్చుకునే మెరిట్ ను బట్టి ప్రభుత్వం నుంచి మీకు ఎన్నో అవార్డులు, దక్కుతాయని భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి ప్రతి ఒక్క విద్యార్థి ఎదగాలని విద్యార్థులకు తెలియజేశారు,అలాగే స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి 10000/ రూపాయలు, 2వ బహుమతి 7000/ రూపాయలు,3వ బహుమతి 5000/ రూపాయలు ఇలా ప్రతి సంవత్సరం ఇస్తామని వాళ్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో, ఉపాధ్యాయులు, వార్డు మెంబెర్ పీవీ ప్రసాద్,మండలబీసీ సెల్ అధ్యక్షులు కేత మల్లికార్జున, అంకెం శ్రీను, మురారి, రాజేష్, శ్రీకాంత్ కోటి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 20 at 6.43.30 PM

SAKSHITHA NEWS