ఆర్ఎడిఎస్ ఆధ్వర్యంలో 50శాతం సబ్సిడీపై కల్టివేటర్ల పంపిణీ
(సాక్షిత న్యూస్)
భవిష్యత్తులో పరిశ్రమల స్థాపనకు కృషి
……చైర్మన్ విగ్నేష్ కుమార్
అశ్వారావుపేట : గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి సంఘం (ఆర్ఎడిఎస్) ఆధ్వర్యంలో మండలంలోని రైతులకు కల్టివేటర్లు పంపిణీ చేశారు. అశ్వారావుపేట జంగారెడ్డిగూడెం రోడ్డులోని డిసిసిబి బ్యాంకు పైన గల కిసాన్ పరివార్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి సంఘం (ఆర్ఏడిఎస్) కార్యాలయంలో చైర్మన్ గజ్జల విగ్నేష్ కుమార్ చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిసాన్ పరివార్ ఫౌండేషన్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించబడుతూ కొత్తగూడెం రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతు శ్రేయస్సు కోసం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, అర్హత కలిగిన రైతులందరికీ 50 శాతం రాయితీతో వ్యవసాయ పరికరాలు అందజేయడం జరుగుతుందని, రైతులకు ట్రాక్టర్లు కూడా మంజూరు చేయడం జరుగుతుందని, మండలంలోని ప్రతి రైతు కూడా కొత్తగూడెం రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్, గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి సంఘం (ఆర్ఎడిఎస్) లో సభ్యత్వం నమోదు చేయించుకోవాలని వారు సూచించారు. భవిష్యత్తులో రైతాంగానికి మేలు రకం వంగడాలు, ఎరువులు, పురుగు మందులు కూడా సరసమైన ధరలకే అందించే ప్రయత్నం చేయనున్నామని వారు తెలిపారు. రైతులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ఉత్పత్తి ఆదారిత ప్రాజెక్టులను కూడా సబ్సిడీపై అందజేయనున్నామని మండలంలోని రైతాంగం సంస్థలో ఉచిత సభ్యత్వాన్ని పొంది అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వారు రైతులను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ జై రాం ప్రసాద్, అశ్వారావుపేట మొదటి సెగ్మెంట్ ఎంపీటీసీ వేముల భారతి, వెలుగు రిటైర్డ్ ఆఫీసర్ నల్లపు శివకుమార్, ఆర్ ఎ డి ఎస్ సీఈవో గుజ్జా సుబ్బారావు, మార్కెటింగ్ మేనేజర్ మడివి నాగరాజు తదితరులు ప్రసంగించారు. అనంతరం మండలంలో ముందుగానే నమోదు చేసుకున్న రైతులకు 50 శాతం సబ్సిడీపై కల్టివేటర్లు చైర్మన్ విగ్నేష్ కుమార్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జై రాంప్రసాద్ ఎంపీటీసీ వేముల భారతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నలుమూలల నుండి రైతులుఅధిక సంఖ్యలో హాజరయ్యారు.