
లబ్ధిదారులకు సిఎంఆర్ఆఫ్ చెక్కులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద ఇటీవలే అనారోగ్య పరిస్థితులతో ఆసుపత్రిలో చికిత్స పొందిన ఒరిగంటి వెంకటరమరాజు కు రూ.60,000/-, జి. లక్ష్మిమ్మ కు రూ. 35,000/-ల చెక్కులు అందజేశారు..
అనంతరం కూన శ్రీశైలం గౌడ్ రోజువారి కార్యాచరణలో భాగంగా తన నివాసం వద్ద నియోజకవర్గం ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకొని.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ..
— నియోజకవర్గం ప్రజలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు..
— ప్రజాపాలనలో ప్రజా సంక్షేమనికి మన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందాన్నారు..
— నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడుతానన్నారు..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రజలు, సంక్షేమ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు…
