SAKSHITHA NEWS

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మంజూరైన 57 చెక్కులకు గాను మొత్తం 34,88, 100/-రూపాయల విలువచేసే చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్సీ, తాతా మధుసూదన్.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు సీఎం సహాయ నిధి ద్వారా సహకారం అందిస్తూ వేలాది కోట్ల రూపాయలు చెక్కుల రూపాన సహాయం అందుతుందని తెలిపారు.

వివిధ అనారోగ్యాల కారణంగా ప్రవేటు హాస్పిటల్ లలో వైద్య సేవలు పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో సీఎం సహాయ నిధి ద్వారా సహాయం అందించడం జిల్లా ప్రజా ప్రతినిధిగా తృప్తి చెందుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటున్న ఏకైక నేత ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని లబ్ధిదారులకు వారు గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలిస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఆశీర్వదించి రానున్న రోజుల్లో అండగా నిలబడాలని లబ్ధిదారులను కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ కూరాకుల నాగభూషణం , జిల్లా రైతు సమన్వయ అధ్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వర్లు, జిల్లా యువజన అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య, మండే వీర హనుమంతురావు , రఘునాథపాలెం మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వీరు నాయక్, ఖమ్మం నగర కార్పొరేటర్ తోట రామారావు, డిసిసిబి డైరెక్టర్ చావా వేణు, పి ఎ సి ఏస్ వైస్ చైర్మన్ చామకూరి రాజు, లక్ష్మారెడ్డి, ముత్యాల వెంకట అప్పారావు, రవి, మీగడ శ్రీనివాస్, తెలంగాణ ఉద్యమకారులు పగడాల నరేందర్, లింగనబోయిన సతీష్, కోడి రెక్క ఉమా శంకర్, నెమలి కొండ వంశి, చెరుకుమల్ల రవి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS