SAKSHITHA NEWS

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

జిల్లా అభివృద్ధి, సమన్వయం, పర్యవేక్షణ ( దిశ ) కమిటీ సమావేశం ఖమ్మంలోని నూతన కలెక్టరేట్ కార్యాలయం ( ఐడీవోసీ) లో జరుగుతుందని దిశ కమిటీ ఛైర్మన్ అయిన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. నామినేటెడ్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు తమ తమ శాఖల సంపూర్ణ వివరాలతో సకాలంలో సమావేశానికి హాజరుకావాలని నామ కోరారు. ఖమ్మం జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పధకాల అమలు తీరు తెన్నులు, పధకాల ప్రగతిపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు. అన్ని కేంద్ర పధకాలను ప్రజా ప్రతినిధుల సమక్షంలో సమీక్షించి, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని నామ చెప్పారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు,వాటి అమలు పురోగతిపై ప్రధానంగా సమీక్షించడం జరుగుతుందని, అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలని నామ నాగేశ్వరరావు తెలిపారు.


SAKSHITHA NEWS