ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు చేపట్టాలని, పాఠశాలలకు సరఫరా చేసిన ఐఎఫ్పి (ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్) లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్, చింతకాని మండలం నామవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులకు చేపడుతున్న డిజిటల్ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు 3, కస్తూరిబా బాలికల విద్యాలయాలకు 6 చొప్పున, ఉన్నత ప్రాధమికొన్నత పాఠశాలలకు ఒకటి చొప్పున ఐఎఫ్పి లను పంపిణీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు పాఠాల బోధన, డిజిటల్ తరగతుల ద్వారా సులభంగా అర్థం అవుతుందని, ఉపాధ్యాయులకు బోధన కూడా సులువు అవుతుందని ఆయన తెలిపారు. అంతకుముందు కలెక్టర్, పందిళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి, పరీక్షా సరళిని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో మౌళిక సదుపాయాలకల్పన ను తనిఖీ చేశారు. పరీక్షలకు సంబంధించి జవాబుపత్రాల రవాణా పకడ్బందీగా చేయాలని అధికారులను సూచించారు.
ఈ సందర్భంగా పీఆర్ ఎస్ఇ చంద్రమౌళి, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, చింతకాని మండల తహసీల్దార్ రమేష్, ఎంపిడివో రామయ్య, ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు ఉన్నారు.
ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు చేపట్టాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…