పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీల విభిన్న ఆందోళన

Spread the love

పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీల విభిన్న ఆందోళన

పార్లమెంట్ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి బ్యానర్లు, నినాదాలతో హోరెత్తించిన ఎంపీలు

ఎంపీల ఆందోళనతో ఆసక్తికర చర్చ

పార్లమెంట్ లో వాయిదాల పర్వం

అదానీ అంశంపై జేపీసీకి బీఆర్ఎస్ డిమాండ్

మోదీ నోరు విప్పాలి : నామ నాగేశ్వరరావు డిమాండ్

లోక్ సభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

అదానీ అంశంపై బీఆర్ఎస్, విపక్ష ఎంపీలు పార్లమెంట్ లో కేంద్రంపై మరింత పట్టు బిగిస్తున్నారు. పట్టిన ఉడుం పట్టుతో దృఢ సంకల్పంతో మరింత ముందుకు సాగుతున్నారు. మోడీ దిగోచ్చి, వాస్తవాలు ప్రజల ముందుంచేంత వరకు పోరాటాన్ని మరింత ఉదృతం చేయాలనే లక్ష్యంతో కార్యోన్ముఖులై ఢిల్లీ కేంద్రంగా సత్తా చాటుతున్నారు. మంగళవారం కూడా అదానీ అంశంపై ఎంపీల విభిన్న ఆందోళనతో పార్లమెంట్ హోరెత్తింది. అదానీ – హిడెన్ బర్గ్ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలి….అదానీని అరెస్ట్ చేయాలి… ప్రధాని మోదీ నోరు తెరిచి వాస్తవాలు ప్రజలముందుంచాలని డిమాండ్ చేస్తూ , బిగ్గరంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్, విపక్ష ఎంపీలు పార్లమెంట్ బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్ పైకి ఎక్కి ఆందోళనకు దిగడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రోజు వారీ ఆందోళనకు భిన్నంగా ఎంపీలు మంగళవారం పార్లమెంట్ భవన్ లోనే ఆందోళనకు దిగడం సర్వత్రా చర్చనీయమైంది.

ఉదయం సభ వాయిదా పడగానే బీఆర్ఎస్ , విపక్షాల ఎంపీలు పార్లమెంట్ భవనంలోని ఫస్ట్ ఫ్లోర్ కు చేరుకుని, నినాదాలున్న ప్లెక్షీ బ్యానర్ తో ప్రత్యేకంగా ఆందోళన చేయడం దేశ ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. పార్లమెంట్ చరిత్రలో ఈ తరహాలో ఎంపీలు ఆందోళనకు దిగడం చాలా అరుదంటున్నారు.ఈ సందర్భంగా లోక్ సభ లో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రధాని మోడీ మోనాన్ని వీడాలని కోరారు.తక్షణమే అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి, పార్లమెంట్లో ఈ అంశంపై చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని భావిస్తున్నారని, కేంద్రం నోరు మెదపకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

ఏమీ లేకపోతే పార్లమెంట్ లో ఎందుకు చర్చ జరపకుండా పారిపోతున్నారని నామ కేంద్రాన్ని ప్రశ్నించారు. బాధ్యత గల ప్రతిపక్షం కనుకనే బీఆర్ఎస్ ప్రజల పక్షాన నిలబడి ఉద్యమిస్తోందని తెలిపారు. కేంద్రం మొండికేస్తే మరింత రాటుతేలుతామని స్పష్టం చేశారు. సభలను కావాలనే వాయిదా వేసుకుంటూ పోతూ కేంద్రం అదానీకి అంటకాగుతుందని, ప్రజలు గమనిస్తున్నారని , మోదీ దిగిరాకపోతే సరైన సమయంలో సరైన గుణపాఠం నేర్పడం ఖాయమని నామ పేర్కొన్నారు.అదానీ అంశంపై చర్చించకుండా సభలను కావాలనే వాయిదా వేస్తూ విలువైన సమయాన్ని, ప్రజా ధనాన్ని కేంద్రం వృధా చేస్తుందని నామ అన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page