
DGP: భావోద్వేగానికి గురైన డీజీపీ ద్వారకా తిరుమలరావు.. అసలు విషయం ఇదే
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమల రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన నేడు పదవీ విరమణ చేయబోతున్న క్రమంలో మంగళగిరి లోని 6వ బెటాలియన్ మైదానంలో వీడ్కోలు పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని సీనియర్, జూనియర్ ఐపీఎస్ అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు వివిధ బెటాలియన్ల నుంచి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ద్వారకా తిరుమలరావు ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
తన జీవితంలో ఇవి ప్రత్యేకమైన ఉద్విగ్నభరిత క్షణాలు అని అన్నారు. ఇకపై తన ఒంటిపై యూనిఫాం ఉండదంటేనే ఏదోలా ఉందని అన్నారు. సర్వీసులో చేరిన నాటి నుంచి అనేక ఛాలెంజ్‌ను స్వీకరించానని.. అందుకు తగినట్లే పని చేశానని అన్నారు. యావత్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సంప్రదాయ పోలీసింగ్ నుంచి సాంకేతిక పోలీసింగ్ వైపు మారిందని కామెంట్ చేశారు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తుల సమయంలోనూ పోలీసులు అత్యంత సాహసోపేతంగా పని చేశారన కితాబిచ్చారు. ప్రభుత్వ సహకారం వల్లే పోలీసు వ్యవస్థను బలోపేతం చేశానని తెలిపారు. గంజాయి, చిన్నారులపై నేరాలు, సైబర్ క్రైమ్ విషయంలో చర్యలు చేపట్టామని వెల్లడించారు.
అనంతరం కొత్త డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta) మాట్లాడుతూ.. పోలీసు శాఖపై ద్వారకా తిరుమలరావు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ప్రజల భద్రత కోసం అనేక సంస్కరణలు చేపట్టారని పేర్కొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని యువతను దృష్టిలో పెట్టుకుని మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఈగల్ టీమ్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్ర డీజీపీగా తన శక్తి మేర పని చేస్తానని అన్నారు. అదేవిధంగా వ్యక్తుల స్వేచ్ఛకు భంగం వాటిల్లేలా ఎవరైనా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app