SAKSHITHA NEWS

సాక్షిత : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని మున్సిపల్ గ్రౌండ్ వద్ద మునుగోడ్ జరిగే ముఖ్యమంత్రి సభకు వెళ్లే వాహనాల భారీ ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బతుకులు బాగు చేస్తారని నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే, అది సిగెటకాక తప్పించుకోవడం వల్లనే మునుగోడ్ కు ఉప ఎన్నిక జరపాల్సి వస్తుందని విమర్శించారు. ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, TRS గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలు అవుతున్న కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వంకు దక్కుతుందని చెప్పారు. పేదింటి ఆడపడుచు పెండ్లికి పెద్దన్న గా KCR మారి ఒక లక్ష 116రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. 24 గంటలు విద్యుత్, కాళేశ్వరం వంటి నూతన ప్రాజెక్ట్ ల నిర్మాణంతో రాష్ట్రంలో పంటసాగు విస్తీర్ణం భారీగా, ధాన్యం దిగుబడి గణనీయంగా పెరిగి దేశానికే అన్నపూర్ణ గా అభివృద్ధి సాధించిందని వివరించారు. అంతేకాకుండా రైతులకు పంట పెట్టుబడి కొసం రైతుబంధు క్రింద ఆర్ధిక సహాయం, ప్రమాదవశాత్తు మరణిస్తే రైతు భీమా క్రింద 5 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించడం ద్వారా ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని వివరించారు.
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహాం తో రాష్ట్రంలో కి భారీగా పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటు జరుగుతుందని, తద్వారా వేలాదిమంది కి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిమ తర్వాత TSPSC ద్వారా 1.35 లక్షల ఉద్యోగాల నియామకం జరిగిందని, నూతనంగా 25 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ లను విడుదల చేసిందని అన్నారు. తమకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న TRS పార్టీని
తమ ఇంటి పార్టీగా ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, నాయకులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, తలసాని ధర్మేందర్ యాదవ్, స్కైలాబ్ యాదవ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, సురేష్ గౌడ్, బాలరాజ్ యాదవ్, కృష్ణ గౌడ్, సంతోష్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS