SAKSHITHA NEWS

శతాబ్దంలో జరగని అభివృద్ధి దశాబ్దంలో జరుగుతుంది: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ గౌలికర్ ఫంక్షన్ హాల్ లో, నీటిపారుదల శాఖ వారు నిర్వహించిన సాగునీటి దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు
తెలంగాణ చరిత్ర వైభవాలను స్మరించుకుంటూ మిషన్ కాకతీయ పథకం ద్వారా తెలంగాణలోని చెరువుల పూటికకు శ్రీకారం చుట్టి చెరువులకు పూర్వ వైభవం తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి “కేసీఆర్” కి మాత్రమే దక్కుతుందన్నారు.


తెలంగాణ రాష్ట్రంలో ఏ చెరువును చూసిన వేసవికాలంలోనూ… నిండుకుండలా తొలుకుతున్నాయన్నారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిచేసి త్వరలోనే వికారాబాద్ కు సాగునీరును అందించే మహోత్కర కార్యానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 06 07 at 2.37.13 PM

SAKSHITHA NEWS