Development of infrastructure to meet the growing population
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన…
మెరుగైన మంచినీటి సరఫరా అందించేలా చర్యలు చేపట్టండి…
ఎస్.ఎన్.డి.పి పనుల్లో వేగం పెంచాలి…
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆదేశం…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 33 డివిజన్ లలో మంచినీటి వ్యవస్థ అభివృద్ధి, ఎస్.ఎన్.డి.పి ఆధ్వర్యంలో చేపడుతున్న వర్షపు నీటి నాలాల అభివృద్ధి, విద్యుత్ సమస్యలు తదితర అంశాలపై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రగతి నగర్ లోని మున్సిపల్ కార్యాలయం వద్ద స్థానిక మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి , కమిషనర్ వంశీకృష్ణ , డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ మరియు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, ఆయా విభాగాల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మెరుగైన మౌలిక వసతుల కల్పనకు అధికారులు ప్రత్యేక దృష్టి వహించాలని సూచించారు. మంచినీటి సమస్యలు ఏ ప్రాంతంలో లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, చేపడుతున్న పనులు త్వరలోనే పరిశీలిస్తానని పేర్కొన్నారు.
అవసరమైన కాలనీల్లో మంచినీటి పైప్ లైన్లు, కనెక్షన్లు, సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. రాబోయే ఎండాకాలంను దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యలు ఎక్కడ తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాకాలంలో ముంపు ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎస్.ఎన్.డి.పి ఆధ్వర్యంలో చేపడుతున్న నాలా నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
పలు డివిజన్ లలో నెలకొన్న విద్యుత్ సంబంధిత సమస్యలపై ప్రత్యేక దృష్టి వహించి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ బి, ఎస్.ఎన్.డి.పి, హెచ్ఎండిఏ, మున్సిపల్ అధికార, సిబ్బంది పాల్గొన్నారు.