Development of colonies with unity of welfare societies : MLA KP Vivekanand
సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీల అభివృద్ధి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని వెంకటాద్రి నగర్ హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ కాలనీలో ఎటువంటి సమస్యలన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ లక్ష్మీ, వైస్ ప్రెసిడెంట్ వెంకట్ నారాయణ, జనరల్ సెక్రెటరీ అనిల్ తివారి, సెక్రెటరీ జ్యోతి, ట్రెజరర్ మల్లేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రాధ, సంధ్య, లక్ష్మి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.