అచ్చంపేట అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు …
- పట్టణంలోని పలు వార్డులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జోగులాంబ టీవీ ప్రతినిధి,అచ్చంపేట: అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. పట్టణంలోని 8,9,18,19 వార్డులలో రూ.1.88 కోట్ల పనులకు మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నరసింహ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు.
ఈ సందర్భంగా 8వ వార్డులో రూ.40లక్షలు, 9వ వార్డులో రూ.70లక్షలు, 18వ వార్డులో రూ. 34లక్షలు, 19వ వార్డులో 44లక్షలతో సీసీ డ్రెయిన్లు మరియు సీసీ రోడ్లకు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీమతి శైలజా విష్ణువర్ధన్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు గోపిశెట్టి శివ, మాజీ కౌన్సిలర్ ఉస్సేన్, నిజాం, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.