ప్రభుత్వ పధకాలు లబ్దిదారులకు చేరేలా ఏర్పాట్లు : డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
మైనారిటీల సంక్షేమానికి ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని వెల్లడి
సాక్షిత సికింద్రాబాద్ : ప్రభుత్వ పధకాలు లబ్దిదారులకు చేరేలా ఏర్పాట్లు జరుపుతున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లోని ముషీరాబాద్ మండలం పరిధిలో 36 మంది లబ్దిదారులకు షాదిముబరాక్ చెక్కులను పద్మారావు గౌడ్ సితాఫలమండీ లోని తన క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో అమలులో ఉన్నన్ని సంక్షేమ పధకాలు ఏ ఇతర రాష్ట్రాల్లో లేవని, చిన్న పిల్లలు మొదలు కొని వయో వృద్దుల వరకు అన్ని వర్గాల వారికీ వివిధ సదుపాయాలను కల్పిస్తున్నారని పద్మారావు గౌడ్ తెలిపారు.
రూ. 36 లక్షల కు పైగా విలువ చేసే చెక్కులను అందించారు. ముషిరాబాద్, మారేడుపల్లి ఎం ఆర్ ఓ లు పద్మా సుందరి, వెంకట లక్ష్మి , కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, కంది శైలజ, బీ ఆర్ ఎస్ నేతలు తీగుల్ల కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు