ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదేపదే ప్రస్తావించిన
అంశం సుగాలి ప్రీతి కేసు.
పవన్ కల్యాణ్ కోసం
ప్రస్తుతం ఆ కేసును సీఐడీకి అప్పగించడానికి చంద్రబాబు
సర్కార్ సిద్ధమైంది.
ఆశ్చర్యం ఏమంటే గతంలో
చంద్రబాబు పాలనలో 2017లో సుగాలి ప్రీతి
అనుమానాస్పద మృతి చెందింది. అప్పుడేమీ తేల్చలేదు.
తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా సుగాలి ప్రీతి
కేసులో బాధితులకు న్యాయం చేయలేదు.
మళ్లీ ఇప్పుడు అధికారంలో చంద్రబాబు ఉన్నారు.
బాధితులు మరోసారి చంద్రబాబు సర్కార్ను
ఆశ్రయించాల్సి వచ్చింది.
సుగాలి ప్రీతి తల్లి పార్వతి
సచివాలయంలో హోంశాఖ మంత్రి అనితను కలిశారు.
కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్టు అనిత చెప్పారని పార్వతి
మీడియాకు వెల్లడించడం గమనార్హం.
కనీసం ఇప్పుడైనా బాధిత కుటుంబానికి న్యాయం
జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. మరీ
ముఖ్యంగా రాజకీయంగా సుగాలి ప్రీతి కేసును వాడుకున్న
పవన్ కల్యాణ్ ఇప్పుడు అధికారంలో భాగస్వామి. సుగాలి
ప్రీతి కేసులో నిందితులను పట్టుకోవడంలో పవన్ కల్యాణ్చొరవ చూపాల్సిన అవసరం వుంది.
లేదంటే పవన్ కల్యాణ్ రాజకీయంగా దోషిగా నిలబడక
తప్పదు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కల్యాణ్
చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు అధికారంలో వున్న
తర్వాత కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోతే
అభాసుపాలు కావడం ఖాయం. మరి పవన్ కల్యాణ్ ఏం
చేస్తారో చూడాలి.