బత్యాల ఆధ్వర్యంలో 13వ రోజుకు చేరుకున్న “రిలే నిరాహార దీక్షలు”.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై పెట్టిన అక్రమ కేసులను, అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “రిలే నిరాహారదీక్షలు” 13వ రోజుకు చేరుకోగా రాజంపేట మండలంలోని వరదయ్యగారిపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీలలోని, ఒంటిమిట్ట మండలంలోని కొండమాచపల్లి, కొత్తమాధవరం ఇంకా సిద్ధవటం, నందలూరు మండలాలలోని పలు గ్రామాల నుండి టిడిపి నాయకులు, కార్యకర్తలు, పదాధికారులు పెద్ద ఎత్తున పాల్గొని దీక్షలు చేపట్టారు………., ఈ దీక్షలో రాజంపేట నియోజకవర్గంలోని పలు మండల, గ్రామాల నుండి పెద్ద ఎత్తున టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.