ఎమ్మార్వో అక్రమ నిర్మాణాలను కూల్చివెయ్యండి.
సాక్షిత : సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
గాజులరామరంలోని సర్వే నెంబర్ 329,342,12 లలో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయమని మునిసిపల్ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలను అమలుచేయండని నేడు ఎమ్మార్వో కి సీపీఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు అలసత్వం వల్ల కబ్జాదారులు ఇదే ఆసరాగా చేసుకొని పేద ప్రజలను నమ్మించి సుమారు పది లక్షల రూపాయలకు అమ్మడం ,ప్రజలు ఇండ్లు కట్టడం తరువాత అధికారులు వచ్చి కూల్చడం వల్ల పేద ప్రజలు మోసపోతున్నారని కావున ఆదిలోనే వాటిని గుర్తించి కూల్చివేసి కబ్జాదారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సర్వే నెంబర్ 329 లో గతంలో ఎర్రజండాలు పాతి భూములను రక్షించమంటే సీపీఐ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు, అరెస్టు చేయించిన రెవిన్యూ అధికారులు మరి ఇప్పుడు ఆ ప్రభుత్వ భూమి మొత్తం అన్యాక్రాంతం అయ్యితే ఎందుకు ఉరుకున్నారని ప్రశ్నించారు. పేద ప్రజలకు ఒక న్యాయం,కబ్జాదారులకు మరో న్యాయం చేస్తూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కు కారకులు అధికారులే అవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల కోశాధికారి సదానంద్, నాయకులు సుంకిరెడ్డి, శ్రీనివాస్,ప్రభాకర్,గుఱ్ఱప్పలు పాల్గొన్నారు.
ఎమ్మార్వో అక్రమ నిర్మాణాలను కూల్చివెయ్యండి.
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…