SAKSHITHA NEWS

న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ (CWC) సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి ఏఐసీపీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun kharge), సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi), సిడబ్ల్యూసి సభ్యులు హాజరయ్యారు..

ఈ సమావేశంలో ప్రధానంగా దేశంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, ఐదు రాష్ట్రాల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

కాగా మల్లికార్జున్‌ ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాక, నూతన కమిటీ ప్రకటన తర్వాత సెప్టెంబర్ 15, 16 తేదీల్లో హైదరాబాద్‌లో తొలి సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు వ్యూహరచనపై పార్టీ చర్చలు జరిపింది. గెలుపే లక్ష్యంగా అందరూ కలిసి కట్టుగా పని చేయాలనే సందేశాన్ని క్యాడర్‌కు అందించింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో (Bharath Jodo) యాత్ర విజయవంతం అయిన తర్వాత భారత్ జోడో యాత్ర 2.0ని చేపట్టడంపై కూడా కమిటీ చర్చలు జరిపింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)లో 39 మంది సాధారణ సభ్యులు ఉన్నారు.

WhatsApp Image 2023 10 09 at 3.31.47 PM

SAKSHITHA NEWS