SAKSHITHA NEWS

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితిపై ఏఐజీ ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వెల్లడించారు.

ఆయన ప్రస్తుతం గుండె, కిడ్ని, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడు తున్నాట్లు తెలిపారు ఏఐజీ వైద్యులు. తమ్మినేనికి మందులతో చికిత్స అందిస్తున్నాం, రక్తపోటు మెరుగుపడుతుందని వివరించారు.

వీరభద్రంకు ఊపిరితిత్తుల్లో నీరు చేరుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించడానికి ప్రయత్ని స్తున్నామన్నారు. ఆయనకు వివిధ విభాగాల నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.

డాక్టర్ సోమరాజు, డాక్టర్ డిఎన్ కుమార్‎ల వైద్యుల బృందం ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు బులిటెన్ విడుదల చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన కారణంగా వెంటిలెటర్ సపోర్ట్‎తో ఖమ్మం నుంచి గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్‎ కు తరలించారు.

ఎమర్జెన్సీ కావడంతో ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందించారు.
మంగళవారం ఉదయం రూరల్ మండలం తెల్దార్ పల్లిలోని నివాసంలో తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో మొదట ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు

కుటుంబసభ్యులు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేని వీరభద్రంను మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శిం చారు.

ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలసుకున్నారు. గతంలో కూడా తమ్మినేనికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనకు అప్పుడు స్టంట్ వేశారు.

తాజాగా, మరోసారి మైల్డ్ స్ట్రోక్ రావడంతో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. అయితే డాక్టర్ల సూచన మేరకు పార్టీ శ్రేణులు హాస్పిటల్‎కి రావొద్దని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేసింది.

Whatsapp Image 2024 01 17 At 11.12.26 Am

SAKSHITHA NEWS