SAKSHITHA NEWS

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

జెడి లక్ష్మీనారాయణ, చలసాని శ్రీనివాసరావు,ఏఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్,నాయకులను అరెస్టు చేయడం సరైంది కాదు.

అరెస్టు చేయవలసిన అవసరం ఏమి వచ్చింది

ప్రత్యేక హోదా విభజన హామీల సాధన కొరకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఛలో సీఎం క్యాంపు కార్యాలయం పిలుపునివ్వడం జరిగింది.

సిపిఐ సంఘీభావం ప్రకటించింది

సిపిఐ నాయకులను అరెస్టు చేయడం సిపిఐ ఆఫీసులు చుట్టూ నాయకుల ఇళ్ల చుట్టూ పోలీసులు పెట్టడం గుంటూరు విజయవాడలోసిపిఐనాయకులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం

ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నారు

ఎన్నికల సమయంలో ప్రత్యర్థ పార్టీల నాయకులపై కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారు

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు పై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి పనులన్నీ పక్కనపెట్టి పరిపాలన గాలికి వదిలేశారు

పోలీసు యంత్రాంగాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని అందరిని అరెస్టులు చేయడం కేసులు పెట్టడం బెదిరించడం చేస్తున్నారు

సియం జగన్ ప్రత్యేక హోదా విభజన హామీల కొరకు చేతనైతే ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టాలి

నరేంద్ర మోడీ వద్ద ప్రత్యేక హోదా గురించి మాట్లాడే దమ్ము లేక చేతకాక మమ్మల్ని అరెస్టులు చేయడం వల్ల మీకు వచ్చేది ఏమిటని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదు

బిజెపి ఈ రాష్ట్రాన్ని మోసం చేసింది

సీఎం జగన్మోహన్ రెడ్డి బిజెపి మెడలు వంచి నిగ్గదీస్తాను, నిలదీస్తాను ప్రత్యేక హోదా సాధిస్తానని మోసం చేశారు.

ఈ రాష్టాన్ని అప్పుల్లో ముంచారు.

WhatsApp Image 2024 03 01 at 2.12.39 PM

SAKSHITHA NEWS