భారత దేశ తొలి దళిత ఉప ప్రధాని, స్వతంత్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నేడు జగతగిరిగుట్ట షిర్డీహిల్స్, బుద్ధ విహార్ లోని విగ్రహానికి పులామాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు మనువాదం కు వ్యతిరేకంగా మాట్లాడితే నేడు ఆర్ ఎస్ ఎస్, బీజేపీ లు మనువాదాన్ని అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందని కావున వాటి ఎత్తుగడలను తిప్పికొట్టి సమసమాజ స్థాపన కోసం పోరాడాలని అన్నారు.
ప్రజలను అంటరాని వారిగా, వెనుకబడిన వారిగా విడదీసి ఊరికి బయటకు,చదువుకు, ఉద్యోగాలకు దూరంగా ఉంచి అగ్రకులాల వారికి సేవచెయ్యలని మనువాదం చెప్పిందని ఆ మనువాదాన్ని మా రాజ్యాంగం అని ఆర్ ఎస్ ఎస్, బీజేపీ చెపుతుందని కావున వెనుకబడిన,దళిత వర్గాల ప్రజలు బీజేపీ మోసపూరిత వాగ్దానాలకు మోసపోకుండా రానున్న ఎన్నికల్లో బుద్ది చెప్పి అంబేద్కర్, జగ్జీవన్ రామ్ లు కలలు కన్న సమ సమాజ నిర్మాణం కోసం పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు హరినాథ్,దళిత హక్కుల పోరాట సమితి నాయకులు వెంకటేశ్ నాయకత్వంలో చంద్రయ్య,సామెల్,ముసలయ్య, దళిత నాయకులు యాకయ్య, సీనియర్ జర్నలిస్ట్ డప్పు రామస్వామి, సీపీఐ నాయకులు శ్రీనివాస్,ఇమామ్, బాబు,శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.