పదవీ విరమణ పొందిన బాబామ్మ ను సన్మానించిన సీపీ*

Spread the love

పదవీ విరమణ పొందిన బాబామ్మ ను సన్మానించిన సీపీ*

సాక్షిత : సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌ లో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., సైబరాబాద్ లో LGS (లాస్ట్ గ్రేడ్ సర్వీస్) గా విధులు నిర్వర్తించి, పదవీ విరమణ పొందినటువంటి D. బాబమ్మను సన్మాన్మించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… ఉద్యోగ నిర్వహణలో సుధీర్ఘ కాలంగా అంకిత భావంతో పనిచేసి పదవీ విరమణ చేస్తున్న డి. బాబామ్మ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని సూచించారు. సమాజ సేవలో పాలు పంచుకోవాలన్నారు. రిటైర్ మెంట్ డబ్బును భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని డబ్బులను ఆచితూచి ఖర్చు చేయాలన్నారు.ఈ సందర్భంగా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఫండ్ క్రింద 30,000/- రూ చెక్ ను బాబామ్మ కు అందచేశారు.అలాగే పొదుపు మొత్తము 2,60,000/-రూ తన బ్యాంక్ ఖాతా లో జమ చేయడం జరిగిందని సీపీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీ గారితో పాటు పోలీసు అధికారుల సంఘం ట్రెజరర్ జి.మల్లేశం పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page