పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ రౌతు,ఎమ్మెల్యే పల్లా….
సాక్షిత:- 79 వ వార్డు గాజువాక నియోజవర్గం అగనంపూడి, వేపచెట్టు జంక్షన్లో “ఇది మంచి ప్రభుత్వం”కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ అధ్యక్షతన గాజువాక శాసనసభ్యులు ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ అందరికీ మంచి పనులు చేసి ఇది మంచి ప్రభుత్వం అని మీతో అనిపించుకునే విధంగా పనులు చేస్తామని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ఇది మంచి ప్రభుత్వం అని మీతో అనిపించుకోవాలని, ముఖ్యంగా ఈ వంద రోజులు పరిపాలనలో ఇచ్చిన మాట ప్రకారము పెన్షన్లు 3000 నుంచి 4000 పెంచి మూడు నెలల బకాయి తో కలిపి 7000 రూపాయలు ఇవ్వడం జరిగిందని, ప్రతినెల పెన్షన్ 1వ తారీఖున ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామని, ముఖ్యంగా వికలాంగులకు 3000 పెన్షన్ 6000 రూపాయలకు జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వికలాంగుల పెన్షన్ పెంచడం జరిగిందని,
అలాగే ఉద్యోగస్తులకు ప్రతినెల 1వ తారీఖున జీతాలు ఇవ్వడం జరుగుతుందని, గత ప్రభుత్వంలో జీతాలు ఏ రోజున ఇస్తారో తెలియని పరిస్థితి ఏర్పడిందని, అలాగే పేదవాడి కోసం “అన్నా క్యాంటీన్”ఐదు రూపాయలకే భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని, అగనంపూడి పరిసర ప్రాంతాలలో త్వరలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తానని, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుచేసి ప్రజల ఆస్తికి భద్రత కల్పించామని, ఈ మధ్య కాలంలో విజయవాడలో వచ్చిన తుఫాను వలన ఇబ్బంది పడిన ప్రజలకు, పది రోజులు బస్సులో ఉండి వారికి కావలసిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు దని, అలాగే ఇచ్చిన మాట ప్రకారం టోల్గేట్ ఎత్తివేయడం జరిగిందని, స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరు ఆందోళన చెందనవసరం లేదని, స్టీల్ ప్లాంట్ ను కాపాడే పూర్తిబాధ్యత మేము తీసుకుంటామని, ఆయన అన్నారు. తదనంతరం అన్నపూర్ణ నగర్ లో 20 లక్షల రూపాయల తో సీ.సీ .రోడ్లు డ్రైన్లు, నిర్మాణమునకు శంకుస్థాపన చేశారు. అలాగే అన్నపూర్ణ నగర్ లో ఒక బోరు, ఎన్టీఆర్ నగర్లో ఒక బోరు, గల్లవానిపాలెం వెళ్లే రోడ్డులో ఒక బోరు, నిర్మించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి , ఏ.పీ .డి రాము , డ్వాక్రా సి ఓ, డ్వాక్రా ఆర్పీలు, జగన్నాథ స్వామి గుడి చైర్మన్ కరణం పైడ్రాజు , డైరెక్టర్లు, జనసేన, బిజెపి, టిడిపి, అధ్యక్షులు, మేడిశెట్టి విజయ్ , కోసూరి తాతారావు , మాడిస వెంకట్రావు , 79 వ వార్డు మహిళా అధ్యక్షురాలు G. కనక భవాని సీనియర్ నాయకులు కర్ణం సత్య రావు, సుబ్బరాజు, నాగేశ్వరరావు, తదితర నాయకులు ,కార్యకర్తలు, అధిక సంఖ్యలో మహిళలు, పాల్గొన్నారు.