Constitution Day Celebrations for Bharat Ratna Dr. Baba Saheb Ambedkar
భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కి రాజ్యాంగదినోత్సవ వేడుకులు
సాక్షిత కర్నూలు జిల్లా
73 వ భారత రాజ్యాంగ దినోత్సవం సంధర్బంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయం పేరడ్ మైదానంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్ , ఏఆర్ అడిషనల్ ఎస్పీ జి. నాగబాబు రాజ్యాంగ రూపకర్త డా.బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్ , ఏఆర్ అడిషనల్ ఎస్పీ జి నాగబాబు మాట్లాడారు. రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించి , భారత రాజ్యాంగం పీఠిక ను చదివి వినిపించి పోలీసు అధికారులు మరియు సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు.1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిందన్నారు
నవంబర్ 26న రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజునే ఏటా ను రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు.
రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, విధులు, చట్టాలే ప్రజలకు రక్షణ అని, రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్కరూ పనిచేస్తూ దేశాభివృద్దిలో పాలుపంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సిఐ గుణశేఖర్ బాబు , ఆర్ ఐలు రమణ, సురేంద్రా రెడ్డి, రవికుమార్, శివారెడ్డి , ఆర్ ఎస్సైలు, ఎ ఆర్, స్పెషల్ పార్టీ పోలీసులు, డిపిఓ పాల్గొన్నారు.