SAKSHITHA NEWS

నియోజకవర్గ అభివృద్దే నా ధ్యేయం – ఎమ్మెల్యే భగత్

— సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెస్తాయి – ఎమ్మెల్యే భగత్

— అభివృద్ధి ని చూసి ఓర్వలేక బిజెపి కుట్ర చేస్తుంది

— కోలాట డప్పుల్లతో భారీగా స్వాగతం పలికిన ప్రజలు

— గుర్రంపోడు మండలంలో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం

నాగార్జునసాగర్ (సాక్షిత ప్రతినిధి).

నియోజకవర్గ అభివృద్దే తన ధ్యేయం అని నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని గుర్రంపోడ్ మండలం, కొప్పోల్ గ్రామం క్రాంతి ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది.బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, మహిళలు కోలాటాలు, డప్పు దరువుల సందడితో, పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే భగత్ మాట్లాడుతూ 2014 లో మాజీ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య గుర్రంపోడు మండలానికి వచ్చినప్పుడు వెన్నంటి ఉన్న ఉద్యమకారుడు మరెడ్డి రఘుమారెడ్డి బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశం లో లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు.
2018 కి ముందు నియోజకవర్గ ప్రజలు సమస్యలు చెప్పుకోవాలంటే ఎమ్మెల్యే అందుబాటులో ఉండేవాడు కాదని 2018 తర్వాత నియోజకవర్గంలో ప్రజల కోసం 24 గంటలు నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని అన్నారు.కెసిఆర్ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పేద ప్రజల బాధ తెలుసుకొని మేనిఫెస్టోలో పెట్టని పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన నాయకుడు కెసిఆర్ అని అన్నారు.
తెలంగాణ సాధించుకున్న తర్వాత పేద బిడ్డకు పెళ్లయితే మేనమామ రూపంలో లక్ష 116 రూ.లు అందజేస్తున్న నాయకుడు కేసీఆర్ అని,
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఒక్కొక్క గ్రామంలో 35 లక్షల నుండి కోటి రూపాయల వరకు సిసి రోడ్లు పూర్తి చేశామని, మళ్లీ ఆశీర్వదిస్తే ప్రతి ఒక్క గ్రామంలో మట్టి రోడ్డు లేకుండా సీసీ రోడ్, డ్రైనేజీలు వచ్చే విధంగా చేసి నిరంతరం ప్రజలకు సేవలందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం దేశంలో ప్రవేశపెట్టాలని టిఆర్ఎస్ పార్టీ నీ బీఆర్ఎస్ పార్టీగా మార్చారని ఆన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చూసి ఓర్వలేక బిజెపి కేంద్ర ప్రభుత్వం ఈడి సీబీఐ లతో దాడులు చేయిస్తూ కుట్రలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, రాష్ట్ర మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవెల్లి విజేందర్ రెడ్డి, ఎంపీపీ ఫోరం జిల్లా అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు లు గజ్జల చెన్నారెడ్డి, సీనియర్ నాయకులు జలగం శ్రీనివాసరావు, హలియా మార్కెట్ ఛైర్మన్ జవ్వాజి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకుడు వనమా వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ వజ్జ ధనుంజయ, పి ఎ సిఎస్ ఛైర్మన్ ఆవుల వెంకన్న, మాజీ మార్కెట్ ఛైర్మన్ కామెర్ల జానయ్య,మండల ప్రధాన కార్యదర్శి రామగిరి చంద్రశేఖర్ రావు, ఉపాధ్యక్షుడు వెలుగు రవి, అధికార ప్రతినిధి సింగం ప్రవీణ్ కుమార్, ప్రచార కార్యదర్శి నల్లబెటి పురుషోత్తం, సంయుక్త కార్యదర్శి పోలె చక్రవర్తి, జిల్లా నాయకుడు పోలేని ముత్యాలు, ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షుడు దోతి చంద్రమౌళి, మండల బిఆర్ ఎస్వీ అధ్యక్షుడు ఏలుకొండ నగేష్, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు మర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS