కాంట్రాక్ట్ లెక్చరర్స్ బదిలీలతో
బజారులో పడ్డ అతిథి ఆధ్యాపకులు

Spread the love

(విత్తం రాకపాయే .. ఉద్యోగం ఊడిపోయే)

తెలంగాణ రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత 8 -10 సంవత్సరాలుగా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్న 1654 మంది అతిథి అధ్యాపకులు ఈ విద్యా సంవత్సరం ముగిసిన అతిధులకు విత్తం రాకపాయే ..! అంటూ లబోదిబో మంటున్న సమయంలో ములిగే నక్కపై తాటి పండు పడ్డట్టుగా కాంట్రాక్టు లెక్చరర్స్ బదిలీలు గెస్ట్ లెక్చరర్ల గుండెలు గుబేల్ అంటున్నాయి.
తెలంగాణలోని 33 జిల్లాలో మ్యూచువల్ ,మెడికల్ ,స్ఫౌజ్ పేరుతో సుమారుగా 360 మంది అతిథి అధ్యాపకుల బతుకులు ఈరోజు బజార్లో పడ్డాయని అతిథులు తమ గోడు వెళ్ళదీస్తు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సమారుగా
40 – 45 మంది గెస్టు లెక్చరర్స్ డిస్టబ్ అయ్యారు.

అతిథుల సేవల్ని పరిగణనలోకి తీసుకుని కాంట్రాక్టు ఉద్యోగుల స్థానంలో అతిథులకు రీప్లేస్మెమెంట్ కల్పించాలని
అతిథి అధ్యాపక సంఘం జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిల్ సదానందం గౌడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఇంటర్ విద్య బలోపేతానికి అహర్నిశలుగా అతిథులు కృషి చేస్తునే ఉన్నారు.
అలాంటి అతిథులకు పెండింగ్ జీతాలు అందించి, డిస్టబ్ అయిన అతిథి అధ్యాపకుల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని, అశ్రమ పాఠశాల అతిథి ఉపాధ్యాయుల మాదిరిగా 12 నెలలు జీతం అతిథులకు కల్పించి వారి సేవలను ప్రభుత్వం వినియోగించు కోవాలని సదానందం గౌడు విజ్ఞప్తి చేసారు .
ధన్యవాదాలతో.అయిల్ సదానందం గౌడు,అతిథి అధ్యాపక సంఘం
రాష్ట్ర అధికార ప్రతినిధి

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page