పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయం

Spread the love

సాక్షిత : రాష్ట్రంలో కాంగ్రెస్ విధానాలు హర్షణీయం

ఒక్కొక్కటిగా ప్రకటించిన హామీలు అమలు

మెగా డీఎస్సీ ప్రకటించిన ప్రభుత్వం 11062 ఉద్యోగ నియామకాలు

నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్

పార్లమంటే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించి 11062 ఉద్యోగ నియమాకాలను చేపట్టినందుకు సోమవారం తన నివాసంలో నగర కాంగ్రెస్ నాయకులతో కలిసి వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల హామీల్లో ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల సమయంలోనే 90 శాతం పూర్తి చేసిందని, ఆరుగ్యారేంటిలో నాలుగు గారెంటీలు రూపు కార్యాచరణలో ఉన్నాయని తెలిపారు.

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంలో వెనకడుగు వేయడం లేదని తెలియజేశారు. రాష్ట్రంలో మెగా డీఎస్సీ ప్రకటించిన ప్రభుత్వం 11062 ఉద్యోగ నియమాకాలు చేపట్టడం అభినందించదగిన విషయమని అన్నారు. రాష్ట్రంలో మారు మూల గ్రామం వరకూ అభివృద్ధి సంక్షేమ ఫలాలు చేరుతున్నాయని, గత ప్రభుత్వంలో ఉన్న దళారులు, కమీషన్ల వ్యవస్థ పూర్తిగా రద్దు అయిందని అన్నారు. కాంగ్రెస్ అంటే అభివృద్ధి అని మరో మరో రాష్ట్రంలో రుజువు అయిందని వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేసి దేశం, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Related Posts

You cannot copy content of this page