
బీసీలను ఆర్థికంగా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం- జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు నిరంజన్ గౌడ్
నాగర్ కర్నూలు జిల్లా సాక్షిత ప్రతినిథి
నాగర్ కర్నూలు జిల్లా
కల్వకుర్తి పట్టణ బిజెపి కార్యాలయంలో పత్రికా సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న తెచ్చిన బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం చేసింది తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 56% ఉన్నారని చెప్పి మూడు లక్షల కోట్ల పైగా విడుదల చేసిన బడ్జెట్లో కేవలం 11 వేల కోట్లు ఇవ్వడం దారుణమని అన్నారు ఈ రాష్ట్రంలో బీసీలు 56% ఉన్నప్పుడు బడ్జెట్లో వారికి 1,50,000 కోట్ల పైగా కేటాయించాల్సింది పోయి కేవలం ముష్టి విసిరేసినట్టు 3.6% బడ్జెట్ ని బీసీలకు కేటాయించడం ద్వారా బీసీల మీద ఈరాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కక్ష మరొకసారి బయటపడింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు నేను గొప్ప చేశానని చెప్పుకుంటూ మాటల కోతలే తప్ప చేతలు లేవని మరోసారి తేటతెలమైంది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో బీసీలకు మీరన్న ప్రకారం 42 శాతం అంటే లక్ష 30 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు లేకపోతే మేము పోరాటం ద్వారా బీసీలకు అండగా నిలబడతామని హెచ్చరించారు, బీసీలకు మీరు ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్ని అసెంబ్లీలో తూతు మంత్రంగా బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం పైకి నెట్టడం అనేది మీరు చేతులు దులుపుకున్నట్టుగా మాకు అర్థమవుతుంది మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేకమైన ఆర్డినెన్స్ తీసుకువచ్చి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం
రాబోయే స్థానిక ఎలక్షన్లో బీసీలు అంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా రాకుండా బిసి సంఘాలు అన్నీ కూడా తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి అధ్యక్షులు గన్నోజు బాబిదేవ్, మాజీ మండల అధ్యక్షులు సురేందర్ గౌడ్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ చందు ముదిరాజ్, బీజేవైఎం జిల్లాజనరల్ సెక్రటరీ ధన్నోజు నరేష్ చారి, బీజేవైఎం అసెంబ్లీ కో కన్వీనర్ మాయని రాజశేఖర్, పట్టణ ఉపాధ్యక్షులు కొల్లూరి శ్రీధర్, నాయకులు పుట్ట చంద్రశేఖర్, నాప శివ, అరవింద్ రెడ్డి, చింటూ, చారి, తదితరులు పాల్గొన్నారు
