Congratulations to all who worked dedicatedly for the maintenance of law and order
శాంతి భద్రతల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేసిన అందరికీ అభినందనలు: సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ *
సాక్షిత జగిత్యాల : సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ కి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది.
జగిత్యాల ఎస్పి గా విధులు నిర్వహించిన సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ బదిలీ పై సూర్యాపేట జిల్లాకు వెళ్తున్న సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు (farewell ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పి కి పోలీస్ అధికారులు వినూత్నంగా రీతిలో వీడ్కోలు పలికారు.జిల్లాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొని పుష్పగుచ్ఛాలు అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ప్రజా శాంతి కోసం రాజీపడకుండా తనతో పాటు అంకితభావంతో సమిష్టిగా కృషి చేసినందుకు పేరు పేరునా హోం గార్డ్ ఆఫీసర్స్ నుండి ఉన్నత అధికారుల వరకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.. ఎన్నికల సమయంలో ఎలాంటి చిన్న అవాంఛనియ సంఘటనలు జరగకుండా, గొడవలు లేకుండా ప్రశాంతవాతావరణం లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే విధంగా విధులు నిర్వహించిన అందరికీ అభినందనలు తెలిపారు..ప్రజలు సుఖశాంతులతో ఉండేందుకు తన వంతు పూర్తి స్థాయిలో బాధ్యత నిర్వహించానని అన్నారు. గడిచిన 10 నెలల పాటు జిల్లాలో పని చేసే అవకాశం రావడం సంతోషాన్ని ఇచ్చిందని, సమర్థవంతంగా పనిచేసిన మధుర స్మృతులతో బదిలీ పై వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు ఉత్తమ సేవలందిస్తే గుర్తింపు పొందుతారని, పోలీస్ అధికారులు సిబ్బంది రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.
అనంతరం ఎస్పీ కి పోలీస్ అధికారులు గజమాలతో సత్కరించి పోలీస్ వాహనంలో ఎక్కించి అందరు పోలీసు అధికారులు వాహనాన్ని తాడుతో లాగుతూ ర్యాలీ గా ఘనంగా వీడ్కోలు పలకడం జరిగింది.
ఈ వీడ్కోలు కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు వినోద్ కుమార్ , భీమ్ రావు ,డిఎస్పి లు రవీంద్ర కుమార్, రఘు చంధర్, ఉమా మహేశ్వర రావు, మరియు DCRB, SB ,CCS, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, నాగేశ్వర రావు, లక్ష్మీనారాయణ , రఫీక్ ఖాన్, మరియు సి.ఐ లు వేణుగోపాల్,రామ్ నరసింహారెడ్డి,రవి,సురేష్ ,నవీన్,RI లు జనీమియ, వేణు మరియు ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.