సాక్షిత అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల ఈ- పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు పే స్కేల్ అమలు చేసి జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మే ప్రారంభిస్తున్నామని తెలియజేస్తూ సమ్మె నోటీసు అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి కి అందజేసిన అశ్వారావుపేట మండల పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు మనోహర్, వెంకట్రావు, రాజేశ్వరి, నాగదేవి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కంప్యూటర్ ఆపరేటర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికీ అన్ని రకాల సదుపాయాలను అందజేయాలని ఈ పంచాయతీ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దానిలో భాగంగానే నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలోనీ 12769 గ్రామ పంచాయతీలకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా పథకాలు అనగా పల్లె ప్రగతి 1,2,3,4 హరిత హరం,జనన మరణ ధృవీకరణలు, భావన నిర్మాణం,వ్యాపార లైసెన్సులు,మంత్లీ ఎక్టివిటీ, అసరా పింక్షన్లు నమోదు, ఎస్సీ, ఎస్టి, బీసీ, మరియు మైనారిటీ కార్పొరేషన్ లోన్లు, దళిత బందు బీసీ బందు గృహలక్ష్మి ఇలా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క పనిని కంప్యూటరీ కరణ చేస్తున్నాము. అలాగే పంచాయతీలో జరిగే ప్రతి ఒక్క పనిలో ప్రధాన పాత్ర పోషిస్తూ మా యొక్క విధులను సక్రమంగా నిర్వహిస్తున్నామని, తెలియజేస్తూ మా యొక్క న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని సవినయంగా కోరుతూ సమ్మె నోటీసు అందజేయటం జరిగిందని తెలియజేస్తూ మా యొక్క డిమాండ్లు,
1).జిల్లా స్థాయిలో పని చేస్తున్న జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లకు పే స్కేల్ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి.
2). ఈ – పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి.
3).మహిళ ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలి.
4). మా ఉద్యోగులందరికీ ఆరోగ్య భీమా కల్పించి, మా యొక్క ఆరోగ్య భద్రతను కల్పించాలి.
5). మా ఉద్యోగులలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించి మా యొక్క కుటుంబాలను ఆదుకోవాలి.
6). రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే అన్ని వసతులను మరియు సహకారమును మా ఉద్యోగులకు కూడా వర్తింప చేయాలి అని మా డిమాండ్లను తెలియజేసి ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సవినయంగా కోరుతూ సమ్మె నోటీసు ను ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి కి, ఎంపిడిఒ శ్రీనివాసరావు కి అందజేశారు.