SAKSHITHA NEWS

స్మార్ట్ సిటీ ఎండి హరిత ఐఏఎస్
స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని తిరుపతి స్మార్ట్ ఎం.డి & సిఈఓ, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరంలో స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పనుల పురోగతిపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఎం.డి. సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తిరుపతి నగరంలో స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పాత మునిసిపల్ కార్పొరేషన్ స్థలంలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ భవన నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు తదితర నిర్మాణాలను అధికారులు నిత్యం పర్యవేక్షణ చేసి త్వరగా పూర్తి చేయాలని అన్నారు. తూకివాకం వద్ద ఏర్పాటు చేసిన సోలార్ ప్రాజెక్ట్ లో పెండింగ్ పనులు త్వరగా చేయాలని అన్నారు.

పలు ప్రాజెక్టుల్లో పెండింగ్ లో ఉన్న అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రైల్వేస్టేషన్ పార్శిల్ ఆఫిస్ ఎదురుగా నిర్మిస్తున్న మల్టిలెవల్ కార్ పార్కింగ్ పనులపై కూడా మరింత శ్రద్ద తీసుకొని నిర్మాణదారులతో సమన్వయం చేసుకొని పనులు వేగవంతం చేయాలని తిరుపతి స్మార్ట్ సిటీ ఎండి & సిఈఓ, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, స్మార్ట్ సిటీ జి.ఎం చంద్రమౌళి, ఎంఈ చంద్రశేఖర్, ఏయికామ్ సంస్థ ప్రతినిధి భాలాజి, ఏఏఓ రాజశేఖర్, వివిధ సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 12 19 at 4.21.14 PM

SAKSHITHA NEWS