SAKSHITHA NEWS

సాక్షిత : కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందించే వైద్యానికి ధీటుగా జగనన్న వైద్య శిబిరాల్లో వైద్యం అందిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 8, 43 వార్డులకు సంబంధించి జర్నలిస్ట్ కాలనీలోని సచివాలయం ఆవరణలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ లో కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ పాల్గొని ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా ప్రజల ఆరోగ్య భద్రత కోసం పెద్ద పీట వేస్తూ జగనన్న ఆరోగ్య వైద్య శిబిరాలు నగరంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో చిన్నపిల్లలకు, గర్భిణీ స్త్రీ సమస్యలు, జనరల్ మెడిసిన్, కంటి వైద్యం అందిస్తున్నారని అన్నారు. అలాగే అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ కు ధీటుగా ఈ వైద్య శిబిరాల్లో వైద్యం అందిస్తున్నామని అన్నారు. ముందుగా ప్రతి ఇంటికి వాలంటీర్, ఆరోగ్య కార్యకర్తలు, సచివాలయ కార్యదర్శులు వచ్చి బి.పి., రక్త పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి టోకెన్ ఇచ్చి, ఆరోగ్య సురక్ష శిబిరానికి తీసుకువచ్చి వైద్యం అందిస్తున్నామని అన్నారు. ప్రజలు నేరుగా వైద్య శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకోవచ్చు అన్నారు. నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు వెయ్యి మంది సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. వీరందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేశామని అన్నారు. ప్రజలందరూ ఈ జగనన్న ఆరోగ్య సురక్షలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సెక్రెటరీ రాధిక, సూపరింటెండెంట్ రవి, వైద్యులు, సచివాలయ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు

Faf520d1 6ed6 4578 Bc8d C15b5030245b

SAKSHITHA NEWS