SAKSHITHA NEWS

ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించండి.
కమిషనర్ ఎన్.మౌర్య*

సాక్షిత తిరుపతి నగరపాలక సంస్థ:
ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్ధ కార్యక్రమం నిర్వహించారు. మేయర్ డాక్టర్ శిరీష, డెప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు శాలిని, ఉమా అజయ్ లు కమిషనర్ ను కలసి తమ వార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రజల నుండి వినతులను స్వీకరించిన కమిషనర్ ప్రజల నుండి వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 62 మంది వినతులు అందాయని అన్నారు. ఇందులో ముఖ్యంగా నగరంలోని రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చాలని, పారిశుద్ధ్య పనులు మరింత మెరుగ్గా జరిపించాలని డిప్యూటీ మేయర్ కోరారు. వర్షాలకు తమ వార్డు జలమయం అవుతోందని పరిష్కరించాలని కార్పొరేటర్ ఉమా అజయ్ కోరారు. బైరాగిపట్టెడ ప్రాంతంలో అనేక సమస్యలు ఉన్నాయని, ఒకసారి పరిశీలించి పరిష్కరించాలని కార్పొరేటర్ షాలిని కోరారు.. సెట్టిపల్లి భూముల సమస్య పరిష్కరించాలని కోరగా పూర్తిగా అవగాహన చేసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చేపల మార్కెట్ దుకాణాల ధరలు తగ్గించాలని వ్యాపారస్తులు కోరగా, పెండింగ్ బిల్లులు చెల్లించాలని చెప్పారు.

తమ ఇండ్ల.పైకి వచ్చిన చెట్ల కొమ్మలు తొలగించాలని, టి.డి.ఆర్. బాండ్లు ఇప్పించాలని, కాలువలు శుభ్రం చేయించాలని ప్రజలు కోరారని తెలిపారు. వీటన్నింటిని త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్ వెంకట్రామి రెడ్డి, సెక్రటరీ రాధిక, డి.ఈ.లు విజయకుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, నరేంద్ర, మహేష్, రాజు, శ్రావణి, ఆర్.ఓ.లు సేతు మాధవ్, కే.ఎల్.వర్మ, ఏ.సి.పి. బాల సుబ్రమణ్యం, మేనేజర్ చిట్టిబాబు, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి, తదితరులు పాల్గొన్నారు..

WhatsApp Image 2024 08 12 at 17.02.57

SAKSHITHA NEWS