సాక్షితతిరుపతి : జగనన్న ఇళ్ళ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అందుకు అవసరమైన ఇంటి నిర్మాణ కార్మికులను పెంచుకోవడం అదేవిధంగా అవసరమైన నిర్మాణ సామాగ్రీని సమకూర్చుకోవడం చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. ఎం.కొత్తపల్లి లే అవుట్ లోని ఇంటి నిర్మాణాలను అధికారులతో కలిసి పరిశీలిస్తూ నిర్మాణ పనులను వేగవంతం చేసి సకాలంలో నిర్మాణాలను పూర్తి చేయాలని, అనుకున్న మేరకు మొదటి విడత గృహప్రవేశాలకు ఇళ్ళను సిద్దం చేయాలని కమిషనర్ హరిత అన్నారు.
తిరుపతి అర్భన్ నివాసితులకు ఎం.కొత్తపల్లిలో కేటాయించిన 4685 ఇంటి స్థలాల్లో నిర్మాణాలు వివిధ దశల్లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, లబ్ధిదారుల సహకారంతో అనుకున్న మేర గృహ ప్రవేశాలకు లబ్ధిదారులను సిద్దం చేస్తున్నట్లు అధికారులు కమిషనర్ కి వివరించారు. ఇప్పటికే 9 బోర్లు వున్నాయని మరో రెండు బోర్లు వేయించాలని అధికారులు కమిషనర్ కి తెలపగా, కమిషనర్ అంగీకరిస్తూ 2 బోర్లు వేయిస్తామన్నారు. లే అవుట్లో ఇంటి నిర్మాణ పనుల్లో ఇబ్బందులు రాకుండ ఇంటి యజమానులను సమన్వయం చేసుకొని హౌసింగ్ అధికారులు కలిసి పని చేయాలని కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. లే అవుట్ పరిశీలనలో కమిషనర్ వెంట హౌసింగ్ పిడి వెంకటేశ్వర రావు, మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, మునిసిపల్ డిఈ సంజీవ్ కుమార్, హౌసింగ్ డిఈ మోహన రావు, అమ్నెటి సెక్రట్రీలు పాల్గొన్నారు.*