తిరుపతి నగరపాలక సంస్థకు డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమాలకు వస్తున్న పిర్యాధులు రిపీట్ కాకుండా సకాలంలో పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో కమిషనర్ హరిత ఐఏఎస్ అర్జీలను స్వీకరించగా, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, విభాగాల అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ముఖ్యంగా కార్పొరేటర్లు సూచించిన ప్రజాభివృద్ది పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరడం జరిగింది.
నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు, 12వ డివిజన్ కార్పొరేటర్ ఎస్.కె.బాబు పోన్ ద్వారా మాట్లాడుతూ లక్ష్మీపురం సర్కిల్ నందు జరుగుతున్న ఓక పని కోసం పైపులు త్రవ్వేయడంతో మూడు నెలలుగా ఓక షాపు మూత పడిందని చెప్పగా, మరో పదిరోజుల్లో ఆ పనిని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఎస్.జి.ఎస్ కాలేజ్ రోడ్డు వేసేందుకు అన్ని అనుమతులు మంజూరు అయినా ఇంకా వేయకపోవడంతో విధ్యార్థులు, వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారని ఎస్.కె.బాబు చెప్పగా, ఈ వారంలోనే ఆ రోడ్డు పనులు మొదలు పెడుతామని చెప్పడం జరిగింది. ఈస్ట్ పోలీస్ స్టేషన్ ప్రక్కన వున్న మునిసిపల్ గెస్ట్ హౌస్ కేసులో మునిసిపల్ కార్పొరేషన్ కు తీర్పు అనుకూలంగా వచ్చినా ఇంకా ఎందుకు స్వాదీనం చేసుకోలేదని, వెంటనే స్వాదీనం చేసుకునే చర్యలు చేపట్టాలని ఎస్.కె.బాబు కోరడంతో, తగు చర్యలు తీసుకునే పనిలోనే వున్నామని బదులివ్వడం జరిగింది.
మరో స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు, 25వ డివిజన్ కార్పొరేటర్ నరసింహచారి స్పందనలో నేరుగా కమిషనర్ కి వినతి పత్రం అందజేస్తూ నగరంలోని కాలువల్లో సీల్ట్ తీయించాలని, మొన్న కురిసిన వర్షానికి కొన్ని చోట్ల కాలువలు పొంగి రోడ్లపైకి వచ్చిన విషయాన్ని తెలియజేస్తూ, వర్షాకాలం ఆరంభమవుతున్నదని, వెంటనే సీల్ట్ తీయించాలని కోరగా, ఎస్.ఈ మోహన్‌కు కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేస్తూ అవసరమైన చోట్ల సీల్ట్ తీయించే పనిని చేపట్టాలన్నారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్ కు 19 పిర్యాధులు, స్పందన కార్యక్రమానికి 20 పిర్యాధులు రావడం జరిగింది. వచ్చిన ముఖ్యమైన పిర్యాధుల్లో రవీంధ్రనగర్ కాలనీలో గతంలో వేసిన బోరు ఎండిపోయినదని చెబుతూ నీటి సమస్యను పరిష్కరించాలని, గరుడాధ్రీ నగర్లో రోడ్డు, కాలువలు, లైట్లు ఏర్పాటు చేయాలని, కరకంబాడీ రిజిస్ట్రేషన్ కాలనీ వద్దనున్న పార్కులో, కాలువల్లో చెత్త వేస్తున్నారని చెబుతూ చెత్త సేకరణకు సిబ్బందిని పంపించాలని,
అదేవిధంగా వీధి లైట్లు ఏర్పాటు చేయాలని, అబ్బన్న కాలనీలో వీధి మధ్యలో వున్న ట్రాన్స్ ఫారమ్ ను తొలగించాలని, న్యూ భాలాజీకాలనీలో ఖాళీగా వున్న జాగాలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని, కేశవాయనగుంట 3వ క్రాస్ నందు గత 3 నెలలుగా తెలుగుగంగ సరిగా రావడం లేదని, శ్రీవారి హైస్కూల్ వద్ద మ్యాన్ హోల్ విరిగిపోయిందని, అదేవిధంగా డ్రైనేజి సమస్యలపై ప్రశాంతి నగర్, సప్తగిరి నగర్, అన్నారావు సర్కిల్, రాఘవేంద్ర నగర్, సుందరయ్య నగర్, మధురానగర్, వైకుంఠ పురం నుండి వచ్చిన పిర్యాధులు అన్నింటిపై సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు కె.ఎల్.వర్మ, సేతుమాధవ్, సెక్రటరీ రాధిక, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి, సిటీ ప్లానింగ్ అధికారులు శ్రీనివాసులు రెడ్డి, బాలసుబ్రమణ్యం, డిఈలు విజయకుమార్ రెడ్డి, రవీంధ్రరెడ్డి, సంజీవ్ కుమార్, మహేష్, గోమతి, దేవిక, మేనేజర్ చిట్టిబాబు, సర్వేయర్ దేవానంద్, సూపర్డెంట్లు, ఆర్.ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.