సాక్షిత తిరుపతి : మెప్మా కార్యక్రమాలు, ప్రభుత్వ పధకాలపై అవగాహన పెంపొందించడానికి రిసోర్స్ పర్సన్(ఆర్పి) కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ ప్రారంభించారు. ఈ సంధర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశంలో పట్టణ పేదరిక నిర్మూలన కొరకు మెప్మా సంస్థ కృషి చేస్తున్నదన్నారు. పట్టణ పేదలతో స్వయం సహాయక సంఘాలను ఏర్పరిచి, సుస్థిర జీవనోపాధులను మహిళలకు కల్పించి తద్వారా సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి కృషి చేస్తున్న మెప్మా సభ్యులందరికి ఈ శిక్షణా శిబిరం ఎంతో ఉపయోగకరమన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందిస్తున్న వారందరూ ముఖ్యంగా అన్ని పథకాలపై సమగ్ర అవగాహన కల్గి వుండాలనే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న ఈ శిక్షణా కార్యక్రమాన్ని రిసోర్స్ పర్సన్లందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇక్కడ చెబుతున్న విషయాలను శ్రద్దగా వింటూ, నోట్ చేసుకోవాలని, సందేహాలు ఏమైన వుంటె ఇక్కడే అడిగి తెలుసుకోవాలన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ మాట్లాడుతూ పేదలకు పథకాలు అందాలనే వుద్దేశంతో మీరంతా చక్కగా పని చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పధకాలకు ఇంకా ఎవరైన అర్హులు వుంటే వారిని గుర్తించాలని, తిరుపతి ఎమ్మెల్యే నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నారని, మనమంతా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడాలన్నారు.
మెప్మా పిడి రాధమ్మ మాట్లాడుతూ ప్రారంభమైన శిక్షణా శిభిరంలో 50 మంది ఆర్పులు పాల్గొన్నారని, తిరుపతి, చిత్తూరు జిల్లాలోని ఆర్పిలకందరికి నెల రోజులపాటు రెండు రోజులకి ఇక బ్యాచ్ లో 50 మంది చొప్పున శిక్షణా శిభిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు విజయ్ భాస్కర్, శ్రీరాములు, సి.ఎం.ఎం కృష్ణవేణి, సంఘాల అధ్యక్షురాలు ప్రతిమా రెడ్డి పాల్గొన్నారు.*