SAKSHITHA NEWS

సాక్షిత : తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహణలో తూకివాకం వద్ద ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్ ను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలించారు. అధికారులకు సూచనలు చేస్తూ తిరుపతి నగరంలో ఉత్పత్తి అవుతున్న తడి పొడి చెత్త, భవణ నిర్మాణ వ్యర్ధాలు, మురుగు నీరును ఈ ప్లాంట్ ద్వారా రీ సైక్లింగ్ చేయడం వలన మన కార్పొరేషన్ కు జాతీయ స్థాయిలో మంచి పేరుందని, ఇటివల ఇక్కడి నిర్వహణ సరిగా లేకపోవడాన్ని ప్రస్థావిస్తూ, ఇకపై అనుకున్న మేర ఈ ప్లాంట్ ద్వారా లక్ష్యాలను సాధించాలన్నారు.

తడి చెత్త నుండి సేంద్రీయ ఎరువులు గతంలో రోజుకి 10 టన్నులు ఉత్పత్తి అవుతుంటె నేడు నిర్వహణ లోపించి పూర్తిగా ఎరువులు తయారు చేయకుండా వుండడాన్ని గుర్తించి నిర్వాహకులకు గట్టిగా ఆదేశాలు జారీ చేస్తూ ప్రతిరోజు 70 టన్నుల తడి చెత్తను ఎరువుగా మార్చాల్సిందేనన్నారు. పొడి చెత్త ప్లాంట్ ను పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, నగరం నుండి వస్తున్న పొడి చెత్తను విభాగాలుగా విభజించి రీ సైక్లింగ్ చేయాలన్నారు. భవన నిర్మాణ వ్యర్ధాలను ఇటుకలు, టైల్స్ గా మార్చే ప్రకియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. మహేంధ్ర బయో గ్యాస్ ప్లాంట్ ను పరిశీలిస్తూ నగరంలోని హోటల్స్ నుండి వ్యర్ధంగా పడవేస్తున్న ఆహార పధర్థాలను అధిక మొత్తంలో సేకరించి గ్యాస్ ఉత్పత్తిని పెంచే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాంట్లలో ఫైర్ సేప్టి వుండాలని, వర్కర్లకి తగిన జాకెట్లు, గ్లౌజులు ఇవ్వాలని కమిషనర్ హరిత ఐఏఎస్ సూచనలు జారీ చేసారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ చంధ్రశేఖర్, డిఈ విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు.*

WhatsApp Image 2023 04 25 at 3.39.04 PM

SAKSHITHA NEWS