SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 26 at 3.26.56 PM

సాక్షితతిరుపతి* : ఓటర్ల సర్వేకి వెల్లేటప్పుడు బూత్ లెవల్ ఆఫిసర్స్(బి.ఎల్.ఓ) తమ వెంట గుర్తింపు పొందిన జాతీయ రాజకీయ పార్టీల తరుపున నియమించిన బూత్ లెవల్ ఏజెంట్స్(బి.ఎల్.ఏ) లకు సమాచారం ఇచ్చి తమతో తీసుకెల్ల వచ్చని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్, తిరుపతి నియోజకవర్గం ఓటర్ల నమోదు అధికారి హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి నియోజకవర్గంకు సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం తిరుపతి నియోజకవర్గం ఓటరు నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్, తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టి ప్రతినిధులు మాట్లాడుతూ తమ పార్టీ తరుపున పంపించిన బి.ఎల్.ఏలకు కొన్ని ప్రాంతాల్లో సర్వేకు వెల్లేటప్పుడు, సరైన సమాచారం ఇవ్వడం లేదని తెలపడంతో స్పందించిన కమిషనర్ బి.ఎల్.ఏలకు, సూపర్ వైజర్లకు ఆదేశాలు జారీ చేస్తూ తిరుపతి నియోజకవర్గంలో ఇంటింటికి జరిగే ఓటర్ల సర్వేకు వెల్లెటప్పుడు, ఇప్పటికే వై.సి.పి, టిడిపిల తరుపున రెకమెండ్ చేసిన బి.ఎల్.ఏలకు సమాచారం ఇవ్వాలన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటింటికి వెల్లి ఆ ఇంట్లో వారి ఓటర్ల వివరాలను, మన దగ్గరున్న ఓటర్ల లిస్ట్ తో సరి చూసుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన వారు ఆ ఇంట్లో వుంటె, వారిని ఓటర్లుగా నమోదు చేయించాలన్నారు. అదే ఇంట్లో ఓటరుగా వుండి మృతి చెంది వుంటె, ఆ ఇంట్లోని వారి కుటుంబికుల నుండి ఫామ్ ధరఖాస్తూ చేయించి, మృతి చెందిన ఓటరుని తొలగించాలన్నారు. ఓటర్ల నమోదులో గాని, తీసి వేయడంలో గాని చట్టబద్దత పాటించాలని, ఏవైన తప్పులు జరిగితే చట్ట ప్రకారం కఠిన చర్యలకు గురి కావల్సి వస్తుందని కమిషనర్ హరిత ఐఏఎస్ హెచ్చరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతూ మీరు రెకమెండ్ చేసిన బి.ఎల్.ఏలకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన పోటో ఐ.డిని క్రియేట్ చేసి పంపించాలన్నారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, తిరుపతి నియోజకవర్గం ఏ.ఇ.ఆర్వోలు అర్భన్ ఎమ్మార్వో వెంకటరమణ, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, డిప్యూటీ తాసీల్ధార్ జీవన్ పాల్గొన్నారు*


SAKSHITHA NEWS