మణిపూర్ లో క్రైస్తవులకు భద్రత కల్పించాలి

Spread the love

తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రైస్తవ సంఘీభావ ర్యాలీ

ఉండవల్లి సెంటర్ నుండి తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ

తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందచేసిన పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధులు

మణిపూర్ లో మారణ హెూమం వెంటనే నిలువరించేలా కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని మణిపూర్ లో క్రైస్తవులకు భద్రత కల్పించాలని కోరుతూ తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఉండవల్లి సెంటర్ నుండి తాడేపల్లి తహసిల్దార్ కార్యాలయం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.తాసిల్దార్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఫెలోషిప్ ప్రతినిధులు మాట్లాడుతూ మన భారత దేశం గణతంత్ర లౌకిక ప్రజాస్వామ్య దేశమని భిన్నత్వంలో ఏకత్వం అనే పదం నలుదిశలా వ్యాపించిందని అన్నారు. గత 80 రోజులుగా మణిపూర్ లో సంచలనం సృష్టించిన మారణ
హోమానికి, స్త్రీలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసి చంపేయడం అత్యంత దుర్మార్గమైన
హేయమైందని మండిపడ్డారు.మన దేశంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా
తెగలు కులాలు మతాల మధ్య వైషమ్యాలుపెచ్చుమీరుతున్నాయిని
అల్లరి మూకల ఆగడాలు అధికమగుతున్నాయిని అన్నారు.
క్రైస్తవులపై, మైనారిటీలపై, దళిత, గిరిజనులపై దమనకాండ అధికమగుతుందని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
మణిపూర్ లో మారణ హోమం సృష్టించిన దోషులను త్వరగా పట్టుకోవాలని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.అలాగే మంగళగిరిలో బాప్టిజంఘాటునుపునర్నిర్మించాలని దానిపై ఉన్న స్టే ని ఎత్తివేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ పాస్టర్స్ ఫెలోషిప్ కార్యవర్గ సభ్యులు గౌరవ అధ్యక్షులు ఎం.జాన్ డగ్లస్, ప్రెసిడెంట్ ఎస్.జోసఫ్,సెక్రటరీ సిహెచ్ డేవిడ్ గాంధీ,మెట్రో రీజియన్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బి.రవి ప్రకాష్ ,CWPF పి.సహదేవ్,నియోజకవర్గ పాస్టర్స్
అసోసియేషన్ అధ్యక్షులు కె.కె.రవి కుమార్,రమేష్ ,కె సుధాకర్,జె ఐజయ్య,తదితరులు పాల్గొన్నారు.పలువురు దళిత నాయకులు, రాజకీయ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు.రెండు నెలలు గా మా రణహోమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టి పట్టనట్టుగా వ్యవహరించటం తగదనిమండిపడ్డారు.ప్రజానాట్యమండలి నాయకులు జగన్, కొట్టె కరుణాకర్ పాల్గొని జానపద పాటలు పాడి సంగీభావం తెలిపారు.ఐద్వా మహిళా సంఘం నేతలు గిరిజ, ఉష పాల్గొని సంఘీభావం తెలియజేసారు .

Related Posts

You cannot copy content of this page